తమిళ తంబిల దీక్ష సక్సెస్.. జల్లికట్టుకు ఒకే

Line Clear For Jallikattu In Tamil Nadu

11:14 AM ON 21st January, 2017 By Mirchi Vilas

Line Clear For Jallikattu In Tamil Nadu

కట్టుబాటు, ఐకమత్యం ఎలా ఉండాలో తమలో తంబీలు మరోసారి నిరూపించారు. సినీ హీరోలు సైతం వరుసగా మద్దతు తెలపడమే కాదు, వారి ఆందోళనకు బాసటగా నిల్చి, అందులో భాగస్వామ్యం అయ్యారు. దీంతో జల్లికట్టుపై బ్యాన్ ఎత్తివేయాలని కోరుతూ మెరీనా బీచ్ లో తమిళతంబీలు చేపట్టిన ఆందోళనకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టేసింది . సినీ, రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించడంతో శుక్రవారం తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. బంద్ కూడా జరిగింది. మెరీనా బీచ్ లో జనం కదం తొక్కారు. బ్యాన్ ఎట్టేవరకూ బీచ్ నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పారు. ఇక పరిస్థితి మరింత తీవ్రంకావడం, రాజకీయ పార్టీల నేతలు ప్రధాని కలిసి ఒత్తిడి తీసుకోవడంతో జల్లికట్టు వివాదానికి తాత్కాలికంగా తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఓ ఆర్డినెన్స్ కేంద్రం జారీ చేయడం, దానికి న్యాయశాఖ ఆమోదం తెలపడం చకచకా అయిపోయాయి.

రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. మరోవైపు కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంతో తమిళనాట ప్రజల్లో ఒకటే ఆనందం. ఇదిలావుండగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. రాజకీయ ఒత్తిడితోనే కేంద్రం వెనక్కి తగ్గిందని ఆరోపించారు.

ఇది కూడా చూడండి: కొండగట్టు అంజన్న మహిమ తెలుసుకోండి

ఇది కూడా చూడండి: విష్ణుమూర్తి నారాయణుడు ఇలా అయ్యాడు

ఇది కూడా చూడండి: సోయా.. తింటే మగాళ్లకు పెద్ద డామేజి ?

English summary

Line Clear For Jallikattu In Tamil Nadu.