'లైన్‌'లోకి రండి బాబూ..!

Line New Features In Latest Update

04:35 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Line New Features In Latest Update

ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్ అన్నీ ఏదో ఒక ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తమ యాప్ వెర్షన్స్‌కు అప్‌డేట్‌లను అందిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే కోవలో ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ 'లైన్ (LINE)' మరో నూతన ఫీచర్‌తో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

లైన్ యాప్‌ను వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్, పీసీ వినియోగదారులు ఇప్పుడు తమ తమ డివైస్‌లలో ఉన్న టెక్ట్స్, ఇమేజ్, వాయిస్ మెసేజ్, ఇతర ఫైల్స్‌ను ఆ యాప్‌కు చెందిన 'కీప్' ఫీచర్ ద్వారా ఆన్‌లైన్ క్లౌడ్‌లో స్టోర్ చేసుకునేందుకు వీలుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు దాదాపు 1 జీబీ వరకు స్టోరేజ్ స్పేస్‌ను పొందవచ్చు. ఏ డివైస్ నుంచి స్టోర్ చేసుకున్న ఫైల్స్‌నైనా ఇతర డివైస్ వాడినప్పుడు కూడా యాక్సెస్ చేసుకునేలా వీలు కల్పించారు. లైన్ నూతన వెర్షన్‌కు అప్‌డేట్ అయితే యూజర్లు ఈ ఫీచర్‌ను పొందవచ్చు.

English summary

Instant messaging app LINE introduces new features like 1gb og cloud storage in which we can store our photos,videos,files etc in its latest update