చేతి రేఖలు ( ‘M’) ఆకారంలో ఉంటే, ఏమవుతుందో తెలుసా ?

Lines On Your Palm Can Reveal Secrets

10:44 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Lines On Your Palm Can Reveal Secrets

మన జీవితం భవిష్యత్ లో ఎలా ఉండబోతుందో, ఏం మంచి జరగబోతుందో, చెడు ఉంటే ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ అంతులేని ఆశ ఉంటుంది. అందుకే మనవాళ్ళు జాతకాలను ఎక్కువగా నమ్ముతుంటారు. విధిరాత ఎలా ఉందో అని తెలుసుకోడానికి మన పూర్వీకుల కాలం నుండి జాతకాలను నమ్ముతున్నారు. ఇప్పటివరకూ చేతి రేఖల ద్వారా మన భవిష్యత్ ను తెలుసుకున్న వారికి ఇప్పుడు మరో శుభవార్త లాంటిది ఇది. సరికొత్త జాతక విధానాన్ని తెలుసుకోబోతున్నారు. అదేమిటనేది క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

మీ అరచేతి రేఖలో ఇంగ్లీష్ అక్షరం ‘ఎం’( ‘M’) ఉంటే మీరు ఎంత ప్రత్యేకమో, మీ భవిష్యత్, మీ వ్యక్తిత్వం ఎలా ఉండబోతు న్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అరచేతిలో ‘M’ లెటర్ ముఖ్యంగా మూడు విషయాలను తెలుపుతుంది. హృదయం, తల అలాగే మీ జీవితాలను ఇది సూచిస్తుంది. ఈ అక్షరం ఉండేలా మీ అరచేతిలో రేఖలు ఉంటే వ్యక్తిత్వం బావుంటుంది. చాలా మంచి స్వభావం కలవారని , ఇతరులకు హాని చేసే గుణం లేదని, చెడ్డవాళ్ళు కాదని ఇట్టే చెప్పవచ్చట. ఈ అక్షరం రేఖలు కలవారు సొంత నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.వాళ్ళు వెళ్ళే దారిలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే చివరికి విజయం సాధిస్తారని ‘కిరొమన్సీ’ జాతకం స్పష్టం చేస్తోంది. ఎలాంటి పరిస్థుతుల్లో అయినా సరే ఇలాంటి వాళ్ళు ధైర్యాన్ని కోల్పోరు. అయితే మహిళల చేతిలో మాత్రం కొన్నిసార్లు దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది కూడా చూడండి: అక్కడికెళ్లి పోలీస్ కేసులో ఇరుక్కున్న టీవీ నటి శ్రీవాణి

ఇది కూడా చూడండి: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది.?

English summary

Lines On Your Palm Can Reveal Secrets About You.