బన్నీ కోసం విశాల్‌ని మోసం చేశాడా?

Lingusamy cheated Vishal for Bunny

11:46 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Lingusamy cheated Vishal for Bunny

విశాల్‌ కి మంచి బ్రేక్‌ ఇచ్చిన చిత్రం 'పందెంకోడి'. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. అయితే మళ్లీ చాలా కాలం తరువాత ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించాలని అన్నీ ప్లాన్‌ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో 'శాందాకోడి -2' అనే టైటిల్‌ ను కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయింది. అసలు విషయంలోకి వస్తే విశాల్‌ తన ట్విట్టర్‌ లో ఈ విధంగా షేర్‌ చేశాడు. ప్రాజెక్టులపై కమిట్‌మెంట్‌ లేని దర్శకులు మన దగ్గర ఉన్నారు. యాక్టర్లు యాక్టింగ్‌కు, దర్శకులు దర్శకత్వం పై మాత్రమే పరిమితం అయితే బాగుంటుందని విశాల్‌ ట్వీట్‌ చేశాడు.

ఈ మాటని ఇన్‌డైరెక్టుగా లింగుస్వామిని అన్నాడు. అల్లు అర్జున్‌తో సినిమా తెరకెక్కించే అవకాశం రావడంతో లింగుస్వామి విశాల్‌ 'శాందాకోడి -2' చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో విశాల్‌ ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం.

English summary

Lingusamy cheated Vishal for Bunny. Lingusamy got chance with Allu Arjun to direct a full mass movie. So he is not interested to do Pandemkodi sequeal with Vishal.