వారెవ్వా మాల్యాను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారట

Liquor king Vijay Malya fires on twitter

02:50 PM ON 4th February, 2017 By Mirchi Vilas

Liquor king Vijay Malya fires on twitter

మొగుడిని కొట్టి మొగ సాల కెక్కిందన్న సామెతను గుర్తుచేసేలా వున్నాయి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మాటలు. ఇండియన్ బ్యాంకులకు రూ.9,000 కోట్ల రూపాయల మేరకు రుణాలు ఎగ్గొట్టి లండన్ కు ఉడాయించిన మాల్యా ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. ఈమేరకు శుక్రవారంనాడు వరుస ట్వీట్లలో సీబీఐపై విమర్శలు గుప్పించాడు. . రెండు బలమైన టీమ్ లైన యుపీఏ, ఎన్డీఏలు ఎలాంటి రిఫరీలు లేకుండా తనను ఫుట్ బాల్ ఆడుకుంటున్నాయని ఆరోపించాడు. సీబీఐ ఎంపిక చేసిన ఇ-మెయిల్స్ ను మీడియాకు రిలీజ్ చేస్తోందని ఆరోపించాడు.

తనపైన, యూపీఏ హయాంలో చోటుచేసుకున్న విషయాలను వక్రీకరిస్తూ తప్పుడు ఆరోపణలపై సీబీఐ మీడియాకు ఇ-మెయిల్స్ విడుదల చేసినట్టు మాల్యా ట్వీట్ చేశాడు.. 'మీడియాను ఒక పిచ్ లా వాడుకుంటున్నారు. నేను ఫుట్ బాల్ ని. యూపీఏలు ఆటాడుతున్న రెండు బలమైన టీమ్ లు. దురదృష్టం ఏమిటంటే ఈ గేమ్ కు రిఫరీలు లేరు' అని అంటున్నాడు. సీబీఐ చేస్తున్న తప్పుడు ఆరోపణలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయన్నాడు. 'కొద్ది మంది నిపుణులైన పోలీసులకు వ్యాపారం, ఎకనామిక్స్ గురించి ఏమి తెలుసు? మారన్ సోదరుల విషయంలోనూ సీబీఐ ఇలాంటి గొప్ప డ్రామానే ఆడింది. చివరికి ఏం జరిగింది? నిజమే నెగ్గిందా? సీబీఐ వాదనే గెలిచిందా?' అని మాల్యా వరుస ట్వీట్ లలో ప్రశ్నించాడు.. ఐడీబీఐ బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో మాల్యాపై కోర్టు నాన్ -బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన నేపథ్యంలో మాల్యా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రూ.900 కోట్ల ఐడీబీఐ రుణంలో రూ.263 కోట్ల మొత్తాన్ని మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సొంత అవసరాల కోసం వాడుకునేందుకు మళ్లించినట్టు ఆరోపిస్తూ సీబీఐ గత వారంలో చార్జిషీటు దాఖలు చేసింది.

ఇది కూడా చూడండి: రోడ్డెక్కిన అడవి రాజులు - ఎందుకో తెలుసా

ఇది కూడా చూడండి: వామ్మో ... అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ !?

English summary

Liquor king Vijay Malya fired on twitter against CBI on friday.