ప్రపంచంలోని అతి పెద్ద 500 కంపెనీల్లో మనవి ఇవే

List Of The Largest Companies In India

01:29 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

List Of The Largest Companies In India

ప్రపంచ వింతల్లో మనదేశం వింతలు కూడా వున్నాయి. అలాగే అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్ ఆర్ధికంగా , పారిశ్రామికంగా ముందంజలో ఉంది. అందుకే ప్రపంచంలో అతి పెద్ద కంపెనీలకు సంబంధించిన జాబితాలో మన దేశానికి చెందిన ఏడుకంపెనీలు చోటు సాధించాయని తేలింది. ఫార్చ్యూన్ 500 ప్రపంచపు అతి పెద్ద కంపెనీల జాబితాలో చోటు సాధించిన ఏడు కంపెనీల్లో నాలుగు ప్రభుత్వానికి చెందినవి అయితే.. మరో మూడు ప్రైవేటు కంపెనీలు కావటం కూడా విశేషం. వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకొని మరీ వీటిని ఎంపిక చేశారు.

అయితే.. ఫార్చ్యూన్ 500 జాబితాలో చోటు సంపాదించిన మన ఏడు కంపెనీల్లో ఏ ఒక్కటి టాప్ వంద కంపెనీల జాబితాలో మాత్రం చోటు దక్కకపోవటం గమనార్హం. ప్రపంచంలో టాప్ మూడు కంపెనీల్లో వాల్ మార్ట్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. రెండోస్థానంలో చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్.. మూడోస్థానంలోనూ చైనాకు చెందిన చైనా నేషనల్ పెట్రోలియం కంపెనీ చోటు దక్కించుకుంది.

ఈ జాబితాలో గల మన దేశానికి చెందిన టాప్ ఏడు కంపెనీలను చూస్తే.. ఇందులో మూడు పెట్రోలియం కంపెనీలే కావటం గమనార్హం. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ఉన్న కంపెనీల కారణంగా ప్రపంచం వ్యాప్తంగా 33 దేశాల్లో 6.7 కోట్ల మందికి ఉపాధినిస్తున్నాయి. ఈ కంపెనీల గత సంవత్సర ఆదాయం 27.6 ట్రిలియన్ డాలర్లుగా చెబుతున్నారు.

1/8 Pages

ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్స్ 161 స్థానంలో నిలిచింది. దేశానికి సంబంధించిన కంపెనీల్లో ఇదే టాప్ కంపెనీగా చెప్పాలి.

English summary

List Of The Largest Companies In India.