సెకండాఫ్ మూవీస్ రెడీ అవుతున్నాయ్

List Of Upcoming Tollywood Movies

11:50 AM ON 28th July, 2016 By Mirchi Vilas

List Of Upcoming Tollywood Movies

ఇదేమిటి ఫస్టాఫ్ , సెకండ్ ఆఫ్ అంటున్నారని ఆశ్చర్య పోతున్నారా. అవును మరి. 2016 ఫస్టాఫ్ ఇలా చూస్తుండగానే టాలీవుడ్ క్యాలెండర్ లో కంప్లీట్ ఐపోయింది కదా. ఇప్పటివరకు ఫస్టాఫ్ లో నాన్నకు ప్రేమతో, సరైనోడు, సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం వంటి మూవీస్ విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో రెండు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాయి. హీరోల కొత్త గెటప్ లు, కథనంలో కొత్తదనం, లోపించిన స్ర్కీన్ ప్లే .. ఉన్నదానికంటే నాలుగింతలు పెరిగిపోయిన ఎక్స్ పెక్టేషన్లు. కారణం ఏదైనా రెండు సినిమాలు మాత్రమే కాస్త లాభం చేకూరుచుకున్నాయి. ఫస్టాఫ్ ముగియడంతో ఇక సెకండాఫ్ లో రిలీజ్ కు రెడీగావున్న సినిమాల జాతకం తేలాల్సివుంది. ఇందులో పెద్ద హీరోల సినిమాలే వున్నాయి. అందుకే సెకండాఫ్ లో విడుదలకు రెడీ అవుతున్న మూవీల లిస్ట్ ని ఓ సారి పరిశీలిస్తే,

1/7 Pages

బాబు బంగారం..

ఇండస్ట్రీ కొచ్చి 30 సంవత్సరాలవుతున్నా ఏం పీకలేకపోయారని తనమీదే సెటైర్లు వేసుకున్న హీరో విక్టరీ వెంకటేష్ ‘బాబు బంగారం’ తో ఈ సెకండాఫ్ లో ప్రేక్షల ముందుకి రాబోతున్నాడు. సిల్వర్ స్ర్కీన్ పై వెంకటేష్ -నయనతారల కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయన సందర్భాలున్నందున, ఈ చిత్రం కూడా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉండొచ్చన్నది ఫ్యాన్స్ అంటున్నారు. ఇటు డైరెక్టర్ మారుతీ కూడా భలే భలే మగాడివోయ్ హిట్ కొట్టి మంచి జోష్ తో బాబు బంగారం చేస్తున్నాడు. వెంకీ కామెడీ, నయనతార గ్లామర్ గ్యారంటీగా హిట్ కొట్టే ఛాన్స్ లున్నాయంటు న్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 అని కన్ఫర్మ్ చేశారు.

English summary

List Of Upcoming Tollywood Movies in 2016.