లీటర్ తేలు విషం ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

Litre Scorpion poison cost is 36 crores

12:09 PM ON 18th May, 2016 By Mirchi Vilas

Litre Scorpion poison cost is 36 crores

ఈ లోకంలో మంచి కంటే చెడే త్వరగా వ్యాపిస్తుంది. అమృతానికంటే విషానికే పవర్‌ ఎక్కువ. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నామంటే మేము ఇప్పుడు చెప్పేది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు విషయంలోకి వెళ్తే ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవ పదార్ధంగా తేలు విషం పరిగణింపబడింది. సాధారణంగా తేలు తన ఆహారం కోసం ఇతర కీటకాలను చంపడానికి, తనను తాను శత్రువుల నుండి కాపాడుకోవడానికి తన కొండిలోని విషాన్ని ఉపయోగిస్తుంది. అయితే కొన్ని సార్లు విషమే విరుగుడుగా పని చేస్తుంది. అలాగే ఇప్పుడు తేలు విషం మనుషుల్లో ఎన్నో రోగాలకు, ఎన్నో రుగత్ములకు మందుగా పని చేస్తుంది.

తేళ్ళలో వేల రకాల జాతులన్నా కానీ కేవలం 25 రకాల జాతుల్లో మాత్రమే జీవులని చంపేటంత విషాన్ని కలిగి ఉంటాయట. తేలు విషంలోని ప్రోటీన్‌ కీళ్ల వాపులకు, పేగు వ్యాధికి మరియు కొన్ని రకాల కేన్సర్‌ వ్యాధలకు దివ్యౌషధంగా పని చేస్తుందట. అందుకే ఒక్క లీటర్‌ తేలు విషం ఖరీదు అక్షరాలా 36 కోట్లు ధర పలుకుతుంది.

English summary

Litre Scorpion poison cost is 36 crores. 1 litre Scorpion poison cost is upto 36 crores. Scorpion poison is helped as medicine for some diseases.