పెళ్లికూతురైన 'లిటిల్‌సోల్జర్స్‌' కావ్య!!

little soldiers kavya getting married

12:00 PM ON 24th November, 2015 By Mirchi Vilas

little soldiers kavya getting married

కావ్య అంటే ఈ పేరు ఎవరికీ తెలీదు. అదే లిటిల్‌సోల్జర్స్‌ లో చిన్న పాప అంటే చెప్పండి అందరికీ తెలిసిపోతుంది. 1996 లో లిటిల్‌ సోల్జర్స్‌ అనే చిన్న పిల్లల చిత్రం రిలీజైంది ఇది పెద్ద హిట్‌. ఇందులో నటించిన చిన్నపాప కావ్యకు జాతీయ ఉత్తమ నటి పురష్కారం ఇచ్చారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఆ అమ్మాయి పాప కాదు పెరిగి పెద్దదయ్యి కుషాల్‌ హిప్పలగావోంకర్‌ అనే అబ్బాయిని పరిణయం ఆడబోతుంది. ఆదివారం నిశ్చితార్ధం కూడా పూర్తయింది. ఇంకో వారం రోజుల్లో కేరళలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది.

బేబి కావ్య లిటిల్‌సోల్జర్స్‌ చిత్రంతో మంచి గుర్తింపు పొందినా ఆ తరువాత హీరోయిన్‌గా ప్రయత్నించలేదు. హైదరాబాద్‌లో ప్రముఖ వైద్యులు గురువారెడ్డి కుమార్తె కావ్య. తండ్రి డాక్టర్‌ కావడంతో కావ్య కూడా వైద్యశాస్త్రం మీదే మొగ్గు చూపింది, తను కూడా డాక్టర్‌ అయింది. కావ్య ప్రముఖ నిర్మాత అయిన గుణ్ణం గంగరాజుకి బంధువు అవుతుందని సమాచారం.

English summary

little soldiers kavya getting married