ఫేస్ బుక్ లేకపోతే ఆనందమే ...........

Live Happily Without Social Media

06:55 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Live Happily Without Social Media

ఈ రోజుల్లో టెక్నాలజీ , సోషల్ మీడియా ప్రజల జీవితాల పై ఎంతటి ప్రభావం చూపుతుందో వెరే చెప్పనకర్లేదు .

తాజాగా హ్యాపీనెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (హెచ్ ఆర్ ఐ) వారు సామాజిక మాధ్యమంలో ఉన్నవారు ఆనందంగా ఉన్నారా. లేక గతంలో వాడి వదిలేసిన వారు ఆనందంగా ఉన్నారా. అని చేసిన అధ్యనం ఫలితాలు పరిశోధకులని సైతం ఆశ్చర్యపరిచాయి. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అధ్యయన కర్తలు ఫేస్బుక్ ను ఎంచుకున్నారు. మొత్తం 1095 మందిని ఈ విషయమై ప్రశ్నించారు . ఇలా ప్రశించిన వారిలో 88 శాతం మంది ఫేస్బుక్ ను ఉపయోగించడం మనేశాకా సంతోషం గా ఉన్నామని చెప్పగా , మిగతా వారు సామాజిక మాధ్యమంలో గడపడం ద్వారా తాము తమ ఒంటరితన్నాని దూరం చేసుకుంటున్నట్టు తెలిపారు.

ఈ అధ్యాయన ఫలితాలను తెలుసుకున్న ఫేస్బుక్ సంస్థ వారు స్పందిస్తూ ఫేస్బుక్ లో అకౌంట్లు తెరిచిన వారు తమకు ఏం కావాలో తెలిస్తే ఫేస్బుక్ మంచి మిత్రుడని , తెలియకుంటేనే అనవసర ఒత్తిడికి గురవుతారని ఫేస్బుక్ తెలిపింది.

ఈ అధ్యాయానికి ఫేస్బుక్ నే ఎందుకు ఎంచుకున్నారని హెచ్ఆర్ఐ వారిని ప్రశ్నించగా దాదాపు అన్ని వయస్సుల వారు ఎక్కువగా ఉపయోగించేది ఫేస్బుక్ మాత్రమే కాబట్టి స్పష్టమైన ఫలితాల కొరకు దీన్ని ఎంచుకున్నట్టు జవాబిచ్చారు.

English summary

Live Happily Without Social Media,