లివ్‌ప్యూర్‌ నుంచి ఎయిర్ ప్యూరిఫయర్లు

Live Pure Launched Air Purifiers

03:39 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Live Pure Launched Air Purifiers

దేశంలో కాలుష్యం పెరుగుతోంది. సుప్రీంకోర్టు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్లకు కోటా విధానం ప్రారంభించింది. ఇటువంటి సమయంలో దేశంలో ఎయిర్ ప్యూరిఫయర్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది లివ్ ప్యూర్ సంస్థ. నీటి శుద్ధత ఉత్పత్తులను అందించే లూమినస్‌ వాటర్‌ టెక్నాలజీస్‌ కంపెనీ చెందిన లివ్‌ప్యూర్‌ బ్రాండ్‌ వీటిని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. తమ మనేసర్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం మనేసర్‌ ప్లాంట్‌ సామర్థ్యం 5,00,000 వాటర్‌ ప్యూరిఫయర్స్‌గా ఉందని, దీనికి అదనంగా 2016 మధ్య వరకు 30వేల గాలి శుద్ధి యంత్రాల ఉత్పత్తిని ప్రారంభించనున్నామని ప్రకటించింది. తమ గాలి శుద్ధి యంత్రాలు వై-ఫైతో పని చేస్తాయని వెల్లడించింది. ఈ ఉత్పత్తుల ధరలు రూ.4,999 నుంచి రూ.29,999గా నిర్ణయించింది.

English summary

Luminous water technology's company Live Pure launched a Air Purifiers in India. Live Pure Air Purifiers will purify the air