ఐఓఎస్ ఫేస్‌బుక్‌ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ 

Live Streaming Feature in Facebook

11:38 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Live Streaming Feature in Facebook

ఫేస్ బుక్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా వెబ్ సైట్. ప్రస్తుతం ఫేస్ బుక్ సంస్థ ఐఓఎస్ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను అందించనుంది. లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియోను పోస్ట్‌ చేసే సదుపాయాన్ని ప్రస్తుతం అమెరికాలోని ఐఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అమెరికాలోని ఐఫోన్‌ వినియోగదారులు ఫేస్‌బుక్‌ ద్వారా లైవ్‌ వీడియోను స్నేహితులు, బంధువులకు షేర్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ డివైజెస్‌కు లైవ్‌ వీడియో సదుపాయం కల్పించడంపై ఫేస్‌బుక్‌ ప్రయత్నాలు చేస్తోంది. ట్విట్టర్‌లోని పెరిస్కోప్‌ ఫీచర్‌ మాదిరిగానే ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ సదుపాయం కల్పిస్తోంది.

English summary

Worlds Number One Social Networking Site Facebook launched a new Video Live Streaming feature to iOS users.Presently this was testing in America iOS users