రేప్ చేస్తుంటే ఆమె స్నేహితురాలే వీడియో తీసింది

Live streaming in social media when a teenage girl is getting rape

04:05 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Live streaming in social media when a teenage girl is getting rape

ప్రస్తుతం లోకంలో ఎక్కడ చూసినా లెక్క లేనన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఒక సంఘటన మర్చిపోయే లోపే మరో ఘోరం జరిగిపోతుంది. ఈ రోజుల్లో అబ్బాయిలే అనుకుంటే.. అమ్మాయిలు కుడా దారుణాలకు పాల్పడుతున్నారు. అసలు అమ్మాయిలే బయటపడకుండా ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఒక వేళ బయట పడితే ఆడవాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. కళ్ళ ముందే స్నేహితురాలి పై రేప్ జరుగుతుంటే ఆపాల్సింది పోయి.. సోషల్ మీడియా యాప్ "పెరిస్కోప్" ను ఉపయోగించి మొత్తం ఘటనను లైవ్ లో చూపించింది 18 ఏళ్ల ఒక యువతి. అసలు విషయంలోకి వెళ్తే అమెరికాలో మరీనా అనే 18 ఏళ్ల అమ్మాయి, ఆమె 17 ఏళ్ల స్నేహితురాలు, ఇంకా 29 ఏళ్ల రేమాండ్ గేట్స్ అనే అబ్బాయి స్నేహంగా ఒకే వీధిలో ఉండేవారు.

అయితే గత 27న వీరు ముగ్గురూ కలసి మందు కొట్టే సమయంలో.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి పై రేమాండ్ గేట్స్ అత్యాచారం చేశాడు. అయితే ఈ దృశ్యాన్ని అంతటినీ.. పెరిస్కోప్ సహాయంతో మరీనా ప్రత్యక్ష ప్రసారం చేసింది. అంతే కాదు బాధితురాలి నగ్న చిత్రాలను కుడా తీసింది. ప్రత్యక్ష ప్రసారం లో దీనిని చూసిన 17 ఏళ్ల అమ్మాయి స్నేహితుడు ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి ఇద్దరి పై అత్యాచారం, లైంగిక వేధింపులు, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసు పెట్టగా.. ఇద్దరికీ 40 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని లాయర్ తెలిపారు.

English summary

Live streaming in social media when a teenage girl is getting rape. 18 year old US woman charged with live streaming minor's rape on social media.