నోట్ల రద్ద యవ్వారంపై ...అద్వానీకి కోపమొ చ్చింది

LK Advani Comments On New Currency Notes

10:49 AM ON 8th December, 2016 By Mirchi Vilas

LK Advani Comments On New Currency Notes

బీజేపీ కురువృద్ధుడు శ్రీ ఎల్.కె.అద్వానీ ఈమధ్య కాలంలో పెద్దగా వార్తల్లోకి రాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అనంతరం పార్లమెంటు సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై తీవ్రంగా స్పందించారు. బుధవారంనాడు నోట్ల రద్దు అంశం పార్లమెంటులో అట్టుడకడం, షరామామూలుగానే ఉభయసభలూ వాయిదా పడడం అద్వానీ లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. సభ సజావుగా సాగకపోవడానికి అధికార, విపక్షాలు రెండూ బాధ్యతులేనని ఆయన తప్పుపట్టారు. అద్వానీ తన ఆందోళనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉభయసభలు ముందుకు సాగకుండా పదేపదే అడ్డుకుంటున్న ఎంపీలపై చర్యలను తీసుకోవాలని, మొండివైఖరి ప్రదర్శిస్తున్న ఎంపీల జీతాల్లో కోత విధించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

సభ సజావుగా సాగడానికి ప్రభుత్వం సరైన పరిష్కారం కనుగొనాలని, లేనిపక్షంలో సభను పదేపదే అడ్డుకుంటూ ఆందోళనకు దిగుతున్న వాళ్ళను సభ విడిచివెళ్లాల్సిందిగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశించాలని అద్వానీ సూచించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై చర్చించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియాను అనంత్ కుమార్ కలుసుకున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : స్మార్ట్ ఫోన్లను హడలెత్తిస్తున్న గూలిగన్ వైరస్.!

ఇవి కూడా చదవండి : సీఎం పదవిలో ఉంటూ కన్నుమూసిన వాళ్ళు వీళ్ళే

English summary

BJP Senior Leader and Politician LK Advani made some sensational comments on the issue of Old Currency notes cancellation and he said that Speaker should take certain decisions to take action on the Members who was against the discussions.