ధోనీతో లోఫర్‌ హీరోయిన్‌

Loafer Heroine To Act In Dhoni Movie

06:49 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Loafer Heroine To Act In Dhoni Movie

టీమిండియా కెప్టెన్‌ ధోనీ లైఫ్‌ స్టోరీ ఆధారంగా ఒక చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ధోనీ పాత్రలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ నటిస్తున్నాడు. ధోనీ భార్య సాక్షి పాత్రలో కైరా అద్వానీ నటిస్తుంది. ధోనీ మాజీ ప్రియురాలి పాత్రలో లోఫర్‌ చిత్రం హీరోయిన్‌ దిశాపటాని నటించనుందని టాక్‌. ఈ రోల్‌కి దిశాపటాని సరిగ్గా సరిపోతుందని, ఆమెను ఒకే చేసినట్లు బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ డైరెక్టర్‌ నీరజ్‌ పాండే మాత్రం ఈ విధంగా ప్రకటించలేదు. మరోవైపు ఈ పాత్ర గురించి వివిధ రకాల చర్చలు కోనసాగుతున్నాయి. ఎందుకంటే ధోనీ కెరీర్‌ ఆరంబంలో లక్ష్మీరాయ్‌ మరియు దీపికాపడుకొనె తో ఎఫైర్లు నడిపినట్లు గాసిప్స్‌ ఉన్నాయి. అయితే ఈ పాత్ర ఎవరిని ఉద్దేశించినది అని చర్చలు జరుగుతున్నాయి. పూరీజగన్నాధ్‌ లోఫర్‌ సినిమాలో పరిచయం చేసిన హీరోయిన్‌ దిశాపటానీ కి ఈ ఛాన్స్‌ రావడంతో చాలా సంతోషంగా ఉందట.

English summary

Disha Patani who was acted in loafer movie with Varuntej has grabbed a chance to act in Sushanth Rajput's Dhoni Movie