'లోఫర్‌' ఆడియో విడుదల!!

Loafer movie audio releasing today in hyderabad Shilpakala Vedika

04:44 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Loafer movie audio releasing today in hyderabad Shilpakala Vedika

ఫాస్ట్‌ డైరెక్టర్‌ పూరీజగన్నాధ్‌ తెరకెక్కించిన తాజా చిత్రం 'లోఫర్‌'. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌, దిశాపటాని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఘాటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఆడియోని ఈరోజు హైదరాబాద్‌ శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా విడుదల చేస్తున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కి మెగా హీరోలు ఎవరూ రాకపోవడంతో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ముఖ్యఅతిధిగా రాబోతున్నారు. అయితే మెగాస్టార్‌ చిరంజీవి లోఫర్‌ టీమ్‌ను విష్ చేస్తూ ఒక వీడియోను పంపిస్తుండడం విశేషం. సి.కళ్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 18న విడుదల చేయబోతున్నారు.

English summary

Loafer movie audio releasing today in hyderabad Shilpakala Vedika. Prabhas is coming as a chief guest for this audio launch.