'లోఫర్‌' సెన్సార్‌ పూర్తి !

Loafer movie censor completed

01:50 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Loafer movie censor completed

ముకుంద, కంచె వంటి క్లాస్‌ చిత్రాలు తరువాత వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న పక్కా మాస్‌ మసాలా సినిమా 'లోఫర్‌'. ఈ చిత్రానికి పూరీ జగన్నాధ్‌ దర్శకత్వం వహించగా వరుణ్‌ సరసన దిశాపటాని హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్‌ ఇటీవలే పూర్తయింది. సెన్సార్‌ బోర్డ్ 'లోఫర్'కి యూ/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ వాళ్లు ఇది ఒక పూర్తి మదర్ సెంటిమెంట్‌ చిత్రంగా తెరకెక్కింది. తల్లీకొడుకులగా కనిపించిన రేవతి, వరుణ్‌ సెంటిమెంట్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించారు అని మెచ్చుకున్నారు.

మరోసారి పోసాని కృష్ణ మురళి తన నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పారు. డిసెంబర్‌ 17న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్‌ నిర్మించగా సునీల్‌ కాశ్యప్‌ సంగీతాన్ని అందించారు.

English summary

Loafer movie censor completed and it got U/A certificate by censor board.