లోఫర్‌కి 10 లక్షలు వ్యూలు!!

loafer trailer got 10 lakhs views

07:23 PM ON 21st November, 2015 By Mirchi Vilas

loafer trailer got 10 lakhs views

'కంచె' చిత్రం విజయంతో మంచి ఊపుమీదున్న వరుణ్‌తేజ్‌ తాజా చిత్రం పూరిజగన్నాధ్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో దిశాపఠాని హీరోయిన్‌గా నటించింది. వరుణ్‌తేజ్‌కి తల్లిగా రేవతి నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని ఇటీవలే యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కి ఇప్పటిదాకా 10 లక్షల వ్యూలు రావడంతో చిత్ర యూనిట్‌ చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైలర్‌లో వరుణ్‌తేజ్‌ ఫుల్‌ మాస్‌గా దొంగగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి మధర్‌ సెంటిమెంట్‌ మరియు ఎమోషనల్‌ సీన్స్తో పాటు పూరితరహా మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది.

సినీపరిశ్రమలో ఈచిత్రం గురించి డిస్కషన్స్‌ మొదలయ్యాయి. ఈ చిత్రం గనుక హిట్టైతే వరుణ్‌తేజ్‌ కెరీర్‌కి మంచి మైలురాయిలా నిలుస్తుంది.
సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్‌ 18 న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకి రాబోతుంది.

English summary

loafer trailer got 10 lakhs views