పాస్‌వర్డ్ లేకున్నా గూగుల్ లాగిన్

Login to Google without Password

05:53 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Login to Google without Password

ఇకపై గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ కావాలంటే మీరు పాస్ వర్డ్ కొట్టనవ్వసరం లేదు. పాస్ వర్డ్ లేకుండా మెయిల్ ఎలా చేస్తాం అనుకుంటున్నారా. ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ త్వరలో ఇలా పాస్‌వర్డ్‌లు టైప్ చేసి అకౌంట్‌లోకి లాగిన్ అయ్యే పాత తరహా విధానానికి స్వస్తి పలకనుంది.

ఫిజికల్ యూఎస్‌బీ కీ ఆథెంటికేషన్, మొబైల్ వెరిఫికేషన్ అనే రెండు పద్ధతుల ద్వారా పాస్‌వర్డ్‌లు లేకుండానే యూజర్లు తమ అకౌంట్లలోకి లాగిన్ అయ్యే విధానాలను గూగుల్ తాజాగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.

మొదటి పద్ధతిలో యూజర్ నుంచి గుర్తింపు తీసుకునే ఒక భౌతిక పరికరాన్ని రూపొందిస్తున్నారు. ఇక రెండో పద్ధతి ఏంటంటే యూజర్ ముందుగా తన మొబైల్ డివైస్‌కు ఆథరైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అకౌంట్‌లోకి లాగిన్ అయ్యే సమయంలో అంతకు ముందు రిజిస్టర్ చేసిన మొబైల్‌కు ఒక రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని ఓకే చేస్తేనే అకౌంట్‌లోకి లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే కాదు. ప్రస్తుతం ఈ రెండు పద్ధతులు టెస్టింగ్ దశలో ఉన్నాయని, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. వీటి ద్వారా యూజర్ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన, ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.

English summary

Google testing new privacy feature for password protection. With this feature you can login to google accounts without entering password.