ప్రచారంలో ఇద్దరు చంద్రుల తనయులు

Lokesh,KTR GHMC Election Campaign

10:11 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Lokesh,KTR GHMC Election Campaign

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రచారపర్వం ఊపందుకుంది. ఫిబ్రవరి 2న పోలింగ్ జరుగ నున్న నేపధ్యంలో పోటాపోటీ ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రేటర్ పీఠం కైవసం చేసుకోవాలని టిఆర్ఎస్ ఓ పక్క ప్రయత్నిస్తుంటే, మరోపక్క టిడిపి - బిజెపి కూటమి ఎత్తులు వేస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరు చంద్రుల తనయుల ప్రచారం ఆకట్టుకుంటోంది. రోడ్ షో , వాడల్లో మీటింగ్ లతో తెలంగాణా సిఎమ్ శ్రీ కె చంద్ర శేఖర రావు కుమారుడు - మంత్రి కెటిఆర్ , ఎపి సిఎమ్ శ్రీ చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హోరెత్తిస్తున్నారు. తండ్రులు పాలనలో దృష్టి పెడితే , తనయులు ఇలా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభివృద్ధిని వివరిస్తూ తమకు ఓటువేస్తే, హైదరాబాద్ ని మరింత అభివృద్ధి చేస్తామంటూ కేటిఆర్ అంటుంటే, ఎక్కడికక్కడ చెత్త పెరుకుపోతుంటే ఇంకేం అభివృద్ధి అని లోకేష్ ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరు చంద్రుల తనయుల ప్రచారం రంజుగా మారింది.

English summary

Nara Chandrababu son Lokesh and KCR,s son KTR both were participating energetically on GHMC election campaign.They were both playing a lead role in politics