ఆయుష్షు పెరగాలంటే ఇవి తినాలట

Longer Life comes by eating green chillis

11:19 AM ON 31st January, 2017 By Mirchi Vilas

Longer Life comes by eating green chillis

చాలామంది ఆరోగ్యం కాపాడుకుంటూ, తద్వారా ఆయుష్షు పెంచుకుంటారు. ఇందుకోసం రకరకాలా చిట్కాలు ప్రయోగిస్తారు. మనకు నిత్యం లభ్యం అయ్యే వాటిని తినడం ద్వారా ఆయుష్షు పెంచుకోవచ్చు. అందులో ముఖ్యంగా మిర్చి. అవును మిరపకాయలు లేని వంటను ఊహించుకోవడం కష్టమే కదా. ఆహారపదార్థాల్లో కారం ఎక్కువగా వేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ అలవాటే మనిషికి లాంగ్ లైఫ్ ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు. గతంలో నిర్వహించిన పరిశోధనల్లో కారం ఎక్కువగా తీసుకోవడం వలన అధికబరువు సమస్య నుంచి కొంత వరకూ తప్పించుకోవచ్చన్న విషయం రుజువైంది. ఇప్పుడు అమెరికాలో నిర్వహించిన పరిశోధనల్లో పండు మిరపకాయలు ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చ ని తేల్చారు. . అమెరికాలో ఈ కాలంలో వారి ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య స్థితిని గమనించారు. 16వేల మంది మీద సుమారు 23 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు.

పండుమిరపకాయలు ఎక్కువగా తినే వారిలో తక్కువ ఆరోగ్య సమస్యలు కనిపించగా, తక్కువ తీసుకునే వారిలో గుండెపోటు వంటి సమస్యలను గుర్తించారు.

కారం ఎక్కువ తినడం వలనే దీర్ఘాయుష్షు సాధ్యమన్న విషయాన్ని వీరు స్పష్టం చేయకపోయినా, కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని మాత్రం వీరు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: అది మెడా ... బొంగరమా(వీడియో)

ఇది కూడా చూడండి: సోడా మిక్స్ చేసి ... రక్తం తాగేస్తున్నారు!

English summary

if you want to live more days you will be definitely eat green chillis. scientists proove that by eating green chillis we can increase our life period