అతి పెద్ద వాల్వో బస్సు.. ఇందులో ఎంతమంది సరిపోతారంటే...

Longest Volvo bus in the world

12:34 PM ON 2nd December, 2016 By Mirchi Vilas

Longest Volvo bus in the world

ఒక బస్సులో సాధారణంగా ఎంతమంది ప్రయాణించవచ్చు అంటే, సుమారు 35 నుంచి 40మంది వరకు అని చెప్పొచ్చు. అదే ఇంకొంచెం పెద్ద బస్సు అయితే 50 మందికి కూడా ప్రయాణించే అవకాశం ఉంది. అయితే, స్వీడన్ కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఓల్వో ప్రపంచంలోనే అతి పెద్ద బస్సు తయారు చేసింది. గ్రాన్ ఆర్కిటిక్ 300 పేరుతో తయారు చేసిన ఈ బస్సులో 300మంది ప్రయాణించవచ్చు. రియో డి జనీరియోలో జరిగిన ఫ్రీట్రాన్స్ రియో ఎగ్జిబిషన్ లో దీనిని ప్రదర్శించింది. ఈ బస్సును ప్రత్యేకించి బ్రెజిల్ కోసం తయారు చేశారు. అక్కడ బస్సుల కోసం ప్రత్యేక లైన్లు ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్లపై ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది.

1/4 Pages

30 మీటర్ల పొడువుండే బస్సులో 300 మంది సులభంగా ప్రయాణించవచ్చు. మూడు బస్సులను కలిపి ఒకే బస్సుగా దీన్ని రూపొందించారు.

English summary

Longest Volvo bus in the world