డిసెంబర్‌ 7న లోఫర్‌ ఆడియో

Lopher Audio Release on 7th December

12:05 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Lopher Audio Release on 7th December

కంచె చిత్రంతో ఫామ్‌లోకి వచ్చిన నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ తాజా చిత్రం లోఫర్‌. పూరీజగన్నాధ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పఠాని హీరోయిన్‌గా పరిచయమవుతుంది. లోఫర్‌ చిత్రంలో వరుణ్‌తేజ్‌ని పూరీజగన్నాథ్‌ పక్కా మాస్‌ హీరోగా ప్రజెంట్‌ చేశాడు. ఇంకా పూరీ మార్క్‌ డైరెక్షన్‌, డైలాగ్స్‌ ఇటీవలే రిలీజ్‌ చేసిన ట్రైలర్‌లో స్పష్టంగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 18న ప్రేక్షకులర ముందుకు తీసుకురావాలని డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు.

అయితే లోఫర్‌ ఆడియో రిలీజ్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ అవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్‌ 7న ఆడియోని రిలీజ్‌ చెయ్యడానికి డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఈ ఆడియోకి మరెగా ఫ్యామిలీ హీరోస్‌ ముఖ్య అతిధులుగా రాబోతున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఒక దొంగగా కనిపించబోతున్నారు. ఇందులో రేవతి వరుణ్‌కి తల్లిగా నటించింది. ఇంకా పోసాని కృష్ణమురళి, ఆలీ, ధనరాజ్‌ ఇతర నటీనటులు నటించారు. ఈ చిత్రానికి సి.కళ్యాణ్‌ నిర్మాత వహించారు.

English summary

Lopher Audio Release on 7th December