అక్కడ దేవుడికి ఆరోగ్యం బాగోలేదట!

Lord Puri Jagannadha health was sick

04:51 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Lord Puri Jagannadha health was sick

అదేంటి దేవుడికి ఆరోగ్యం బాగోకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, ఇది నిజం! దేవుడికి ఆరోగ్యం బాగోలేదు, అందువల్ల ఆయన భక్తులను చూడలేరు. ఆయన ప్రస్తుతం ఔషధ సేవలో ఉన్నారు.. 15 రోజులు విశ్రాంతి తీసుకుంటారు అని ఆలయ ప్రధాన పూజారి సెలవిచ్చారు. ఇదంతా ఎక్కడో తెలుసా? పూరీ జగన్నాథ ఆలయంలో. దేశంలో ఎక్కడా ఇలా లేదు గానీ, ఒక్క పూరీ ఆలయంలోనే ప్రతీ ఏడాది ఇలా చేస్తుంటారట. పూరీలోనే దేవుడు మానవరూపంలో ఉంటాడు. అందువల్ల మనుష్య ధర్మాన్ని భగవంతుడు పాటిస్తాడని అంటారు. ఆ ఆచారం ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ తర్వాత.. పూరీ జగన్నాథుడికి 35 స్వర్ణఘటాలతో స్నానం చేయిస్తారు.

తర్వాత ఆయనను ప్రత్యేక స్వర్ణ సింహాసనం పై కూర్చోబెట్టి, మామిడిపళ్ల రసం ఇస్తారు.
ఎక్కువ సేపు స్నానం చేయడం, తర్వాత మామిడిరసం తాగడంతో భగవంతుడికి అనారోగ్యంగా ఉందని, అందువల్ల 15 రోజుల పాటు భోగాలు ఏమీ చేయకుండా కేవలం మూలికా ఔషధాలు మాత్రమే ఇస్తామని జగన్నాథ ధామ్ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ భట్టి తెలియజేసారు. ఆషా శుక్ల ఏకాదశి రోజున మళ్లీ ఆలయాన్ని తెరుస్తారు. అప్పుడు సుభద్ర, బలభద్రులతో కలిసి జగన్నాథుడు రథోత్సవంలో పాల్గొంటారు.

భక్తుల తరఫున భగవంతుడికి ఒక విజ్ఞాపన పంపామని, ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాత భక్తులు వచ్చి, ఆయన ఆశీస్సులు తీసుకుంటామని అడుగుతున్నారని భట్టి అన్నారు. దేవాలయం తిరిగి తెరిచిన తర్వాత భగవంతుడికి 21 రకాల పదార్థాలతో నివేదన చేసి, నగరంలో రథయాత్ర చేస్తామని తెలిపారు.

English summary

Lord Puri Jagannadha health was sick