శివుడు స్వయంగా పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ ఇదే!

Lord Shiva told Varalakshmi pooja to Parvathi Devi

11:43 AM ON 12th August, 2016 By Mirchi Vilas

Lord Shiva told Varalakshmi pooja to Parvathi Devi

శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలకు సందడే సందడి. శ్రావణ మంగళవారం, శుక్రవారం వ్రతాలు, నోములు, పేరంటాలు ఇలా అస్సలు తీరిక ఉండదు. శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఇక ఈరోజే(ఆగస్టు 12) వరలక్ష్మి వ్రతం. ఇంతకీ వరలక్ష్మి ఎక్కడిదంటే, స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించారని చెబుతారు. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు.

అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. పార్వతి దేవికి కథ గురించి శివుడు ఎలా వివరించాడంటే.. 

1/6 Pages

పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉండేవట. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదట. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి, తెల్లవారుఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. ఎంతో అణకువగా గల ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగిందట. ఒకరోజు ఆ మాహాయిల్లాలికి మహాలక్ష్మి కలలో ప్రత్యక్షమై ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యా.

English summary

Lord Shiva told Varalakshmi pooja to Parvathi Devi