శ్రీమహావిష్ణువు శిలగా మారింది ఇక్కడేనా?

Lord Sri Maha Vishnu changed here as a stone

10:57 AM ON 26th July, 2016 By Mirchi Vilas

Lord Sri Maha Vishnu changed here as a stone

కొన్ని పురాణాలకు కూడా అందని విషయాలున్నాయి. ఎప్పుడో అప్పుడు అవి బయట పడుతుంటాయి. కానీ ఇది పురాణానికి చెందిన అంశమే. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో, సముద్ర మట్టానికి 2620 అడుగుల ఎగువన, భగీరథి నది ఒడ్డున, ఉత్తర కాశీకి 72 కి.మీ దూరంలో హర్శిల్ అనే గ్రామం వుంది. మొదట్లో హరిశిల అనేవారట. కాలక్రమేణా హర్శిల్ అనే పేరు వచ్చింది. అసలు ఈ పేరు గురించి చిన్న పౌరాణిక కథ చెబుతారు. సత్య యుగంలో నదీ దేవతలైన భగీరథి, జలంధరిలు తమ ఇద్దరిలో ఎవరు ప్రాముఖ్యమైనవారు అనే విషయం మీద వాదులాడుకుంటూంటే, అది చూసిన విష్ణువు(విష్ణువుకే మరో పేరు హరి) ఒక శిలగా మారిపోయి, వారి ఆగ్రహాన్నంతటినీ ఆ శిలలోకి తీసుకున్నాడట.

అందువల్లే ఈ గ్రామానికి హరిశిల గా వ్యవహరించబడేదట. కాలక్రమంలో హర్శిల్ అనే పేరు వచ్చిందట. చార్ ధాం అనబడే నాలుగు ప్రముఖ హిందూ యాత్రాకేంద్రాల్లో ఒకటైన గంగోత్రికి ఈ గ్రామం సమీపంలో ఉంది. దీనికి 30 కి.మీ దూరంలో ఉన్న గంగోత్రి జాతీయ పార్క్ ఇక్కడి మరొక ముఖ్య పర్యాటక కేంద్రం.

1/10 Pages

1. ధరలి...


ధరలి అనే గ్రామం హర్శిల్ కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో వుంది. చుట్టూ దేవదారు వృక్షాలతో నిండిన ఈ స్ధలం పవిత్ర గంగానది ఒడ్డున వుంది. మంచుతో కూడిన శిఖరాలు, యాపిల్ తోటలు, చిక్కుడు పంటలు వంటివి సందర్శకులను అలరిస్తాయి.

English summary

Lord Sri Maha Vishnu changed here as a stone