ఇలా పిలిస్తే శ్రీకృష్ణుడు తప్పక వస్తాడట!

Lord Srikrishna will helps when you call like this

12:52 PM ON 20th August, 2016 By Mirchi Vilas

Lord Srikrishna will helps when you call like this

చెల్లెలి మనసు తెలిసినవాడు శ్రీకృష్ణుడు. చెల్లెలు సుభద్ర అర్జునుని ఇష్టపడుతోందని తెలుసుకుని వారిద్దరికీ వివాహం జరిగేలా చేశాడు. ఈ అన్నాచెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా సుభద్రా సహిత బలరామ కృష్ణులు పూరీ జగన్నాథ్ ఆలయంలో విలసిల్లుతూ పూజలందుకుంటున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ప్రజలు ఏటేటా రథోత్సవం నిర్వహిస్తున్నారు. అన్న అని పిలిచినా, అన్నయ్య అనే మాట చెప్పినా శ్రీకృష్ణుడికి ప్రాణం. పాండవ సతి ద్రౌపది తన చెల్లెలికి సవతి. అయినా ద్రౌపదిని తన సొంత చెల్లెలుగానే భావించాడు కృష్ణుడు. కురుసభలో ద్రౌపదీ వస్ర్తాపహరణం చేస్తుంటే పాండవులు సైతం నేల చూపులు చూసిన వేళ రక్షాబంధనానికి గుర్తుగా నిండు సభలో ఆమె గౌరవాన్ని నిలబెట్టింది శ్రీకృష్ణుడే.

కృష్ణా నన్ను నువ్వే కాపాడాలి అని ఆరోజు ద్రౌపది శ్రీకృష్ణుని శరణు వేడుకుంది. తనను నమ్మి శరణువేడిన వారిని ఎప్పుడూ కాపాడతానని అభయమిచ్చేవాడు శ్రీకృష్ణుడు.

English summary

Lord Srikrishna will helps when you call like this