ఆ గుళ్లో స్వామికి ఆర్ఎస్ఎస్ యూనిఫారం.. షాకింగ్ న్యూస్

Lord Swaminarayan idol dressed in rss uniform

12:14 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Lord Swaminarayan idol dressed in rss uniform

ఒక్కో ఘటన ఆటోమేటిక్ గ్గా వివాదం అయిపోతుంది. మరికొన్ని వివాదం పులుముకుంటాయి. ఇంకొన్ని వివాదంలో చిక్కుకుంటాయ్.. ఏదైనా వివాదం అంటే వార్తల్లో నానుతుంది. మరి ఇందులో ఏ కేటగిరీలోకి ఇది వస్తోందో ఏమో గానీ, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో కొలువైన ప్రసిద్ధ స్వామి నారాయణ్ దేవాలయం దేశంలో ప్రముఖ వార్తాంశంగా మారిపోయింది. ఆ దేవాలయంలోని స్వామినారాయణ్ విగ్రహానికి ఏకంగా ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) యూనిఫాం వేయడం ఇందుకు కారణంగా మారింది. ఆలయంలోని స్వామినారాయణ్ విగ్రహానికి ఖాకీ నిక్కరు వేసి, దాని పై తెలుపు రంగు చొక్కా.. తలకి నల్లని క్యాప్.. నల్ల బూట్లు వేసి ఉంచారు.

అంతేకాకుండా ఈ విగ్రహం ఒక చేతిలో జాతీయ జెండా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసేస్తున్నాయి. దీంతో పలువురు విమర్శలు గుప్పిన్నారు. దీని పై ఆలయ నిర్వహణాధికారి మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఓ భక్తుడు ఈ దుస్తులను ఆలయానికి కానుకగా సమర్పించారని తెలిపారు. దేవుడ్ని వివిధ రూపాల్లో అలంకరించడం సాధారణమేనని, అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ యూనిఫాంను వేశామని, ఇందులో ఎటువంటి ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది వివాదాస్పదంగా మారుతుందన్న ఆలోచన తమకు రాలేదని ఆలయ నిర్వాహకుడు విశ్వప్రకాశ్ జీ వెల్లడించారు.

దీని పై సీనియర్ కాంగ్రెస్ నేత శంకర్ సింహ్ వాఘేలా ఓ రేంజ్ లో ఏకి పారేశారు. దేవుడి విగ్రహానికి ఖాకీ నిక్కరు వేసి ఏం నిరూపించాలనుకుంటున్నారు? అంటూ ఆయన మండిపడ్డారు. ఈరోజు దేవుడికి ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేశారు.. రేపు బిజెపి యూనిఫాం వేస్తారా? అని ఆయన విరుచుకు పడ్డారు.. దీని పై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయ్ రుపానీ మాట్లాడుతూ.. విషయం తెలిసి తానూ ఆశ్చర్యపోయానని, అలా జరిగివుండకూడదన్నారు. ఇలాంటి వాటిని తాను అంగీకరించనని చెప్పారు. మరి మార్పులు చేయిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

English summary

Lord Swaminarayan idol dressed in rss uniform