షేర్ మార్కెట్ దిమ్మ తిరిగింది

Loss In Stock Market

06:06 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Loss In Stock Market

కొత్త ఏడాది (2016) వచ్చిందో లేదో అప్పుడే షేర్ మార్కెట్ కునారిల్లింది. ఈ ఏడాది ప్రారంభమైన మొదటి ట్రేడింగ్‌ రోజునే చైనా మార్కెట్ ప్రభావం భారత్ పై చూపింది. దీంతో షేర్ బ్రోకర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చైనా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూల డంతో స్టాక్‌ వాణిజ్యానికి అంతరాయం కలగడంతో దీంతో భారత్‌.. జపాన్‌ సహా పలు దేశాల స్టాక్‌ మార్కెట్ల ను ఒక్కసారిగా కుదిపేశాయి. దీంతో స్టాక్ బ్రోకర్లకు దిమ్మతిరిగిపోయింది.

చైనాకు చెందిన ‘సీఎస్‌ఐ300’ స్టాక్‌ సూచీ 5 శాతానికి పడిపోవడంతో.. కొత్త ఏడాది (2016)లో వచ్చిన మొదటి ట్రేడింగ్‌ రోజు సోమవారం అక్కడ స్టాక్‌ వాణిజ్యానికి అంతరాయం కలగడంతో పాటూ , ఆపై 7గా పెరగటంతో ట్రేడింగ్‌ మొత్తం నిలిపివేశారు. దీని గొలుసుకట్టు చర్య ప్రభావం ఇటు ఆసియా దేశాలపైనా పడింది. తీవ్ర కుదుపునకు లోనుకావటంతో షాంఘై మార్కెట్‌ కార్యకలాపాల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అసలు చైనా స్టాక్‌ మార్కెట్‌లో అనుసరించే విధానంలో చైనా ‘సీఎస్‌ఐ 300’ సూచీలో ట్రేడింగ్‌ స్థాయికి 5 శాతం తగ్గినా, 5 శాతం లాభపడినా ట్రేడింగ్‌ను 15 నిమిషాలపాటు తాత్కాలికంగా నిలిపేస్తారు. ఒకవేళ పాత సూచీ స్థాయి కనుక 7 శాతం మేరకు పతనమైన పక్షంలో మిగిలిన రోజంతా వాణిజ్యాన్ని రద్దు చేస్తారు. సోమవారం కూడా అదే. జరిగింది.

ఫలితంగా భారత స్టాక్‌ మార్కెట్లకు ఈ సోమవారం ‘బ్లాక్‌మండే’గా మిగిలిందని పలువురు విశ్లేషకులు అబిప్రాయ పడ్డారు. అటు సెన్సెక్స్‌.. ఇటు నిఫ్టీ ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. భారీ నష్టాల్లో కూరుకుపోయి.. కుదేలయ్యాయి. చాలా వారాల తర్వాత బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గరిష్ఠ స్థాయిలో 550 పాయింట్లు (మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో) పైగా నష్టపోగా, నిఫ్టీ కూడా ఆ బాటనే అనుసరించి , ఏకంగా 160 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇక ట్రేడింగ్‌ ముగిసే సమయానికి స్వల్పంగా మెరుగై, సెన్సెక్స్‌ 537, నిఫ్టీ 171 పాయింట్ల వద్ద భారంగా ముగిశాయి. స్టాక్ మార్కెట్ పతనంతో షేర్ బ్రోకర్లు నైరాశ్యంలో పడిపోయారు.

English summary

China stock exchanges was ended early on Monday after shares fell by seven percent.The drop in the CSI300 index, which covers both bourses, for the first time triggered an automatic early closure under the new system, after an initial 15-minute trading halt failed to stem the declines.