పాటల పల్లకిలో  '‘లవ్‌ చేయాలా వద్దా..?

Love Cheyyala Vadda Audio Launch

04:31 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Love Cheyyala Vadda Audio Launch

కార్తీక్‌ - శ్వేతావర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘లవ్‌ చేయాలా వద్దా..?’ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కల్యాణ్‌కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నందిని రెడ్డి, బసిరెడ్డి, త్రినాథరావు నక్కిన తదితరులు పాల్గొన్నారు. జి.నౌషాద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి జి.వి.రమణ, సి.సంతోష్‌ కుమారి నిర్మాతలు గా వున్నారు. గౌతమ్‌ డానీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తొలి సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘‘చిన్న చిత్రాలు విజయవంతమైతే మరింత మంది నిర్మాతలు సినిమాలు చేయడాని ముందుకొస్తారు. ‘లవ్‌ చేయాలా వద్దా..?’ పాటలు, చిత్రం ప్రేక్షకాదరణ పొందాలి. విశాఖపట్నం కూడా సినిమా హబ్‌గా మారాలి’’ అన్నారు . ‘‘యువతరం ఆలోచనల్లోని గందరగోళం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇంటిల్లిపాదికీ నచ్చేలా సరికొత్త వినోదంతో తీర్చిదిద్దా మని దర్శకుడు చెప్పాడు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశాఖపట్నం ప్రాంతానికి చెందినవాళ్లంతా కలిసి చేశాం. ఇంకా ఆయన చెబుతూ విశాఖపట్నం లో మంచి ప్రతిభ ఉంది’’ అని వివరించారు..

English summary

Love Cheyyala Vadda movie Audio was released yesterday in Hyderabad. Kalyan Krishna,Nandini Reddy,Basi Reddy,Trinadha Rao and few other were attended as chief guests for this audio releasing event