ప్రేయసిని హత్య చేసి , ఇంట్లోనే పూడ్చి పెట్టి ...

Lover killed dead body buried in house

10:43 AM ON 6th February, 2017 By Mirchi Vilas

Lover killed dead body buried in house

ప్రేమ పేరిట సాగే అకృత్యాలు చూస్తున్నాం కదా. అయితే పశ్చిమ్ బంగాలో ఓ ప్రేమికుడు చేసిన ఓ దారుణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ప్రేయసిని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. అంత్యంత దారుణమైన ఈ ఘటన వివరాల్లోకెళితే..

ఆకాంక్ష శర్మ(28) అనే యువతికి ఉదయ్ దాస్ తో 2007లో జయపుర విమానాశ్రయంలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్తా స్నేహం, ప్రేమగా మారింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండేవారు. కొన్నేళ్ల తర్వాత ఆకాంక్ష ఉదయ్ తో కలిసి ఉండడానికి భోపాల్ వచ్చేయాలనుకుంది. ఇందుకు తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలిసి న్యూయార్క్ లో ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పి ఇంట్లో నుంచి వచ్చేసింది. అలా ఏడు నెలల పాటు న్యూయార్క్ నుంచే మాట్లాడుతున్నట్లు, మెసేజ్ లుచేస్తున్నట్లు నాటకం ఆడింది. మొదట్లో ఉదయ్ , ఆకాంక్షల మధ్య అంతాబాగానే ఉంది కానీ కొద్దిరోజుల తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఆకాంక్ష ఉండగానే ఉదయ్ మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆకాంక్షను వదిలించుకోవడానికి ఆమె గొంతునులిమి చంపేశాడు. ఇంట్లోనే గొయ్యి తవ్వి శవాన్ని అందులో పూడ్చిపెట్టి సిమెంట్ తో కప్పేశాడు. అనంతరం దానిపై ఓ చిన్న గట్టులాంటిది కట్టించాడు. అద్దె ఇల్లు అయిన ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేస్తే యజమానికి అనుమానం వస్తుందని ఏడు నెలల పాటు అక్కడే ఉన్నాడు.

నెలలు గడుస్తున్నా ఆకాంక్ష నుంచి ఎలాంటి ఫోను లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకాంక్ష ఫోన్ చేసిన నెంబర్ ను ట్రాక్ చేసి ఆమె భోపాల్ నుంచి ఫోనులో మాట్లాడిందని తెలుసుకున్న పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. ఉదయ్ గురించి తెలిసి విచారించడానికి అతని ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో అసహజంగా గట్టు కనిపించడంతో తమదైన శైలిలో అతడిని ప్రశ్నించారు. దాంతో విషయం మొత్తం తెలిసింది. ఆకాంక్ష మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి ఉదయ్ ని అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: తులసి మొక్క ఆకులు రంగు మారితే ప్రమాదమేనట

ఇది కూడా చూడండి: పెళ్ళికొడుకు లేడు ... అయినా పెళ్లయింది... ఎలా ?

English summary

a girl killed by her boyfriend he burried her dead body in his house.