వైజాగ్‌లో లవర్స్ ట్రీ!

Lovers tree in Vizag

11:08 AM ON 12th December, 2015 By Mirchi Vilas

Lovers tree in Vizag

ప్రేమించుకున్న ప్రేమికులు తమ జ్ఞాపకాలు చెరిగిపోకుండా ఉండటానికి చెట్ల పైన, రాళ్లు పైన తమ పేర్లు రాస్తారు. కీచైన్స్ పైన, ఫోటోలు పైన తమ పేర్లు రాయించుకుని పదిలంగా దాచుకుంటారు. ఇలాంటి ప్రేమికుల కోసం వైజాగ్‌లో ఒక చెట్టు వెలసింది. ఆ చెట్టుకు ఉన్న ఆకుల పై వందలాది మంది ప్రేమికుల పేర్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మాలంటే క కచ్చితంగా వైజాగ్‌ వెళ్లి ఇది కళ్ళారా చూడండి అప్పుడు మీరే నమ్ముతారు. అసలు విషయం ఏంటంటే వైజాగ్‌లో ఒక పార్క్‌లో ఉన్న ఈ లవర్స్‌ ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈ చెట్టు పేరు 'క్లుసియా రోసియా' మన దేశంలో ఎక్కువగా ఈ చెట్టు బెంగళూరులో లభిస్తుంది. అయితే వైజాగ్‌ లో మాత్రం 'దైవేర్సిరి' అనే పార్క్‌లో ఈ చెట్టు కనిపిస్తుంది. అలాగే ఈ చెట్టు ఆకుల పై ఏమి రాస్తే అవి నిజమౌతాయని చాలా మంది నమ్మకం. రాను రాను ఈ నమ్మకం పరాకాష్ఠకు చేరుతుంది. దీనితో ఈ విషయం తెలుసుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఈ చెట్టు వద్దకు వచ్చి తమ ప్రియుడు పేరు, ప్రేయసి పేరు రాస్తున్నారు. ఈ చెట్టుకి ఉన్న మరో ప్రత్యేకం ఏంటంటే ఈ చెట్టు ఆకుల పై పేర్లు రాస్తే అవి 10 ఏళ్ల వరకూ చెరిగిపోకుండా ఉంటాయట. ఏంటి మీరు కూడా వెళ్ళి రాయాలనుకుంటున్నారా? అయితే వెళ్లి రాసేయండి మరి.


English summary

Lovers tree in Vizag. On this tree leaves lovers are writing their names to fulfill their dreams and desires.