తగ్గిన వంటగ్యాస్‌ ధర

LPG Gas Price Decreased By 82 Rupees

09:59 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

LPG Gas Price Decreased By 82 Rupees

వంటగ్యాస్‌ సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఎల్పీజీ సిలిండర్‌కు రూ.82.50 తగ్గిస్తూ చమురు సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో తగ్గుదల కొనసాగుతుండడంతో ఈ ప్రయోజనం వినియోగదారులకు బదిలీ అయింది. ధర తగ్గింపు తర్వాత 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండరు ధర ఢిల్లీలో రూ.575గా ఉంది. గత మూడు నెలల్లో వరుసగా మూడు సార్లు వంటగ్యాస్‌ ధరను పెంచిన తర్వాత తాజాగా తగ్గించారు. చివరి సారిగా జనవరి 1న సిలిండర్‌కు రూ.49.50 పెంచారు.

English summary

The cost of the LPG gas cost was reduced by 82.50 by the government for the first time in this year.Previously in last three months LPG Gas cost was increased three times and now reduce for the first time