అదృష్టమంటే ఇదేనేమో

Luckiest Man Wons Lottery Two Times

05:45 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Luckiest Man Wons Lottery Two Times

ప్రతి ఒక్క మనిషి తన జీవిత కాలంలో ఒక్కసారైనా అదృష్టం తలుపు తడితే చాలనుకుంటారు. కానీ అదే అదృష్టం ఒకేసారి రెండు సార్లు తలుపు తడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇలాంటి ఘటనే కాలిఫోర్నియాలో జరిగింది . కాలిఫోర్నియాకు చెందిన రాడ్ని మెలోస్‌ అనే వ్యక్తి స్థానిక మొడ్‌స్టో స్టోర్‌లో "కాలిఫోర్నియా లాటరీ" వారి 30 వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన లాటరీ టిక్కెట్‌ను 30 డాలర్లు పెట్టికొన్నారు. లాటరీ టిక్కెట్‌ను స్క్రాచ్‌ చేసిన మెడోస్‌కు 1000 డాలర్ల బహుమతి వచ్చింది. దీంతో ఉబ్బితబ్బింపు అయిపోయిన మెడోస్‌ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో మూడు లాటరీ టిక్కెట్లను కొన్నాడు .

ఆ టిక్కెట్లను స్క్రాచ్‌ చేసిన మెడోస్‌ కు కళ్ళు చెదిరే బహుమతి వచ్చింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 మిలియన్‌ డాలర్లను గెలుచుకుని మెడోస్‌ కోటీశ్వరుడైయ్యాడు.

భారీగా డబ్బును గెలుచుకున్న ఆనందంలో మెడోస్‌ మాట్లాడుతూ మొదట తాను ఈ విషయాన్ని నమ్మలేకపోయానని, మెడోస్‌ తాను వారానికి 4 నుండి 5 లాటరీ టిక్కెట్లను కొంటానని, ఇంతకు ముందు ఎప్పుడు గెలుచుకోలేకపోయానని, కానీ ఇప్పుడు ఒకే సమయంలో రెండు గెలిపొందినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తను గెలుచుకున్న డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో ఇంకా ఆలోచించలేదని మెడోస్‌ అన్నాడు.

English summary

A man named Rodney Meadows became billionare by winning 10 million dollars in California lottery 30th aniversary