2కోట్ల జీతంతో గూగిల్‌ కొలువు

Lucknow iitan got 2crore job

12:52 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Lucknow iitan got 2crore job

కంప్యూటర్‌ సైన్స్‌ చివరి సంవత్సరం చదువుతున్న లక్నో కుర్రాడిని గూగిల్‌ కొలువు వరించింది. అదీ కూడా ఆషామాషీ జీతం కాదు. ఏడాదికి రెండు కోట్ల రూపాయల జీతంతో. లక్నో ఐఐటికి చెందిన అశుతోష్‌ అగర్వాల్‌కు గూగిల్‌ నుండి ఆఫర్‌ వచ్చింది. ప్రస్తుతం లక్నో ఐఐటిలో ఆఖరి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న 21 ఏళ్ళ అగర్వాల్‌ ఇప్పటికే గూగిల్‌ న్యూయార్క్‌లో మూడునెలల శిక్షణను కూడా పూర్తి చేసాడు. రోజులకు తరబడి ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం అగర్వాల్‌ను గూగిల్‌ జాబ్‌ వరించిందట. ఐఐటి విద్య ఇంకా పూర్తవ్వని కారణంగా వచ్చే ఏడాది అగర్వాల్‌ తన డ్రీమ్‌ జాబ్‌లో చేరనున్నాడు.

English summary

An IIT student who studies computer science in IIT lucknow was got a job offer with a package of 2 crore. He was already completed his three months training in newyork google campus