4జీతో లుమియా 650

Lumia 650 SmartphoneWith 4G

11:50 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Lumia 650 SmartphoneWith 4G

సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్త మైక్రోసాఫ్ట్‌.. త్వరలో లుమియా650 స్మార్ట్‌ ఫోన్‌ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలను యూకేలో థర్డ్‌పార్టీ ఆన్‌లైన్‌ రీటైలర్‌ స్టోర్ ద్వారా ఇంటర్నెట్ లో రిలీజ్ చేసింది. అక్కడ ప్రీ బుకింగ్‌లు ప్రారంభించేందుకు వీలుగా లుమియా 650 ఫీచర్లను వెల్లడించింది. 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 19,400.

లుమియా 650 ఫీచర్లు..

5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 1.1 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టం, 8జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, ఉచితంగా 30జీబీ ఆన్‌డ్రైవ్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, డ్యూయల్‌ సిమ్‌

English summary

Microsoft company launched a new Windows Operated smartphone called Lumia 650. The price of this smartphone would be Rs. 19,400 and it comes with the key features like windows 10 operating system,8-megapixel rear camera, 8GB inbuilt storage,5-inch HD resolution IPS LCD display