చేతివేలి గోరుపై ఈ గుర్తుని గమనించారా ?

Lunula tells your health condition

01:08 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Lunula tells your health condition

గోర్లుని చూసి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు అనే విషయం అందరికీ తెలుసు. అయితే గోర్లపై అనేకరకాల మార్పులను మనం చూస్తూ ఉంటాం... గీతలు గీతలుగా ఉంటాయి, ఇంకా గోర్ల రంగు విచిత్రంగా ఉంటుంది ఇంకా ఇలాంటి మార్పులు గోర్ల పై ఎన్నో గమనించవచ్చు. అయితే ఈ రోజు మనం తెలుసుకునేది మాత్రం గోరు ప్రారంభంలో అర్ధ చంద్రాకారంలో ఉండే షేప్ గురించి మాట్లాడుకుందాం.

చేతి వేలి గోరు ప్రారంభంలో అర్ధ చంద్రాకారంలో నెలవంకను పోలిన ఒక ఆకారం ఉంటుంది. ఈ ఆకారాన్ని 'లునులా' అని అంటారు. ఈ లునులా మన శరీరంలో అతి సున్నితమైన భాగాల్లో ఒకటి అని చెప్తుంటారు. లునులా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూన్ అని అర్ధం. స్మాల్ మాన్ అంటే నెలవంక, చంద్రవంక అనమాట. అయితే ఈ లునులా దెబ్బతింటే గోరు పూర్తిగా నాశనం అవుతుందట. గోరుని సర్జరీ చేసి తీసేసినా లునులా మాత్రం దెబ్బతినదట. అది ఎంత కాలమైనా అలాగే ఉంటుంది. లునులా ఉండే ఆకారాన్ని రంగుని బట్టి అనారోగ్య సమస్యలను సులభంగా గుర్తించవచ్చట. అవేంటో చూద్దామా...

ఒకవేళ లునులా లేకపోతే కనుక వారు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని అర్ధం. ఇటువంటి వారు మంచి పోషకాహారం తీసుకోవడం మంచిది.

లునులా రంగు నీలంగా లేదా పూర్తిగా తెలుపు రంగులో పాలిపోయి ఉంటే కనుక వారికి డయాబెటిస్ రాబోతుందని అర్ధం. ఇలాంటి వారు ముందు జాగ్రత్త వహించి డాక్టర్ ని సంప్రదించడం చాలా మంచిది.

లునులా మీద ఎరుపు రంగులో మచ్చలు ఉంటే గుండె సంబంధ వ్యాదులు ఉన్నాయని తెలుసుకోవాలి. ఇటువంటి వారు మంచి పోషకాహారం తీసుకోవడం తో పాటు వైద్యుడిని సంప్రదించాలి.

లునులా ఆకారం మరీ చిన్నదిగా, గుర్తుపట్ట లేనంతగా ఉంటే వారు అజీర్ణంతో బాధపడుతున్నారని తెలుసుకోవాలి. వారి శరీరంలో విష, వ్యర్ధ పదార్ధాలు ఎక్కువగా పేరుకు పోయాయని తెలుసుకోవాలి. ఇటువంటి వారు ఎక్కువగా నీటిని సేవించాలి.

ఇది కూడా చూడండి:ప్రభుదేవా డాన్స్ అదుర్స్ : అభినేత్రి టీజర్

ఇది కూడా చూడండి:ఈ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే!

ఇది కూడా చూడండి:రోడ్డు దాటుతూ కెమెరాకు దొరికేసిన దెయ్యం

English summary

In this article, we have listed about what is the Lunula tells your health condition.