రిలయన్స్ జియో నుంచి ఎల్‌వైఎఫ్‌ ఫ్లేమ్‌ 1 

Lyf Flame 1 Smartphone From Reliance Zio

10:23 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Lyf Flame 1 Smartphone From Reliance Zio

రిలయన్స్‌ జియోకు చెందిన ఎల్‌వైఎఫ్‌-బ్రాండ్‌లో మరో కొత్త ఫోన్ రిలీజ్ అయ్యింది. ఎల్‌వైఎఫ్‌ ఫ్లేమ్‌1 పేరిట ఈ కొత్త ఫోన్‌ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.6,490. రిలయన్స్‌ డిజిటల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ల జాబితాలో చేర్చింది. అయితే ఈ ఫోన్‌ ఎప్పుడు అందుబాటులోకి రానుందో వెల్లడించలేదు. రిలయన్స్‌ ఇప్పటికే ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌తో మూడు ఫోన్లు ఎల్‌వైఎఫ్‌ ఎర్త్‌1, వాటర్‌ 1, వాటర్‌ 2లను విడుదల చేసింది. ఇప్పుడు ఫ్లేమ్‌ 1 పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది.

ఎల్ వైఎఫ్ ఫ్లేమ్ 1 ఫీచర్లు ఇవే..

4.5 అంగుళాల తెర, 1.1 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5 ఎంపీ రేర్‌ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, ఆండ్రాయిడ్‌ 5.1, 4జీ సపోర్ట్‌, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

English summary

Reliance Retail's fourth Lyf-branded smartphone Flame 1 was launched at Rs. 6,490.This smartphone comes with the key features like 4.50-inch Display, 1GB RAM,8GB Storage,5-megapixel Rear Camera,5-megapixel Front Camera,2000mAh Battery