మాటివి లైసెన్స్ రద్దు(వీడియో)

Maa tv channel license was cencelled

06:22 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Maa tv channel license was cencelled

మాటీవీ నెట్ వర్క్ లైసెన్స్ రెన్యూవల్స్ ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిరాకరించింది. మాటీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ లైసెన్స్ లను రద్దు చేశారు. తాజాగా రెన్యువల్ చేసిన లైసెన్స్ ల జాబితా నుంచి మా టీవీ నాలుగు ఛానెల్స్ ను కేంద్రం తొలగించింది. మా సంస్థ డైరెక్టర్ పై ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్ ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది. ప్రసారమంత్రిత్వ శాఖ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మా టీవీ ఛానెల్స్ ను స్టార్ గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజా కేంద్ర నిర్ణయంతో లైసెన్స్ లను తమ పేరిట మార్చుకునేందుకు స్టార్ గ్రూప్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

1/4 Pages

73 టీవీ ఛానళ్లు నిషేధం...
కాగా కేంద్ర ప్రభుత్వం పలు టీవీ ఛానళ్లపై ఉక్కుపాదం మోపింది. నిబంధనలు ఉల్లఘించిన ఛానళ్లు, రేడియో స్టేషన్లకు షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘన ఆరోపిస్తూ 73 టీవీ ఛానళ్లు, 24 ఎఫ్ఎం చానల్స్, 9 వార్తపత్రికలపై నిషేధం విధిస్తున్నట్లు సమాచార, ప్రసారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఛానళ్లలో మన తెలుగుకి సంబంధించి మాటివి వంటి వినోద ఛానళ్లు ఉన్నాయన్నమాట. లైసెన్స్ రద్దు చేసిన విషయాన్ని స్వయంగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రాజ్యసభకు అనౌన్స్ చేశారు. లైసెన్స్ రద్దు చేసిన వాటిలో ముఖ్యంగా జస్ట్ టీవీ, ఖాస్ టీవీ, మోహ పంజాబ్, విజన్ ఎంటర్టైన్మెంట్, కీ టీవీ, లెమన్ టీవీ, ఫోకస్ ఎన్ఈ, ఫోకస్ హర్యానా, ఎస్టీవీ హర్యానా, ఛానళ్లు ఉన్నాయి.

English summary

Maa tv channel license was cencelled