కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేస్తున్న మాటీవీ

Maa tv getting into new building

02:48 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Maa tv getting into new building

ఎంటర్టైన్మెంట్ ఛానల్ మాటివి కొత్త అడుగు వేస్తోంది. స్టార్ టీవీ టేకోవర్ తో స్టార్ తిరిగిన మాటీవీ కొత్త స్టూడియోలో గృహ ప్రవేశం చేయబోతోంది. బంజారాహిల్స్ పార్క్ హయత్ కు ఎదురుగా 7 అంతస్తుల భారీ బిల్డింగ్ లోకి మాటీవీ మారబోతోంది. ఈ భవంతి ఏపీ మాజీ హోంమంత్రి తనయుడిదని చెపుతున్నారు. రేటింగ్స్ లో కాస్త వెనుకబడినా స్టార్ తో కలవడంతో మాటీవీ రెవెన్యూలు బాగా పెరుగుతున్నాయి. ఈ బిల్డింగ్ లో అధునాతన స్టూడియోలతో ప్రోగ్రామింగ్ అదరగొడతారట. ఈ విషయం స్టార్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక మాటీవీ స్ట్రాటజీ హెడ్ గా సుస్మిత నియమితులయ్యారు. స్టార్ సౌత్ ఇండియా హెడ్ గా పనిచేస్తున్న కెవిన్ మాటీవీ వ్యాపారాన్ని నియంత్రిస్తున్నారు. మరిన్ని హంగులతో మాటివి దూసుకుపోతోందని అంటున్నారు.

English summary

Maa tv getting into new building