కిరీటం జార్చుకున్న మిస్ వరల్డ్!

Madeline Cowe was elected as a Miss world

03:15 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Madeline Cowe was elected as a Miss world

అంటే ఇదేదో కాలు జారడంతో, మరొకటో అనుకుంటారేమో అదేంకాదు. అయితే ఏమిటో వివరాల్లోకి వెళ్లాల్సిందే.. మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా-2016 కిరీటాన్ని క్వీన్ ల్యాండ్ సుందరి మడిలైన్ కోవె దక్కించుకుంది. మెల్ బోర్న్ లోని క్రౌన్ పల్లాడియంలో అట్టహాసంగా మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా పోటీలు జరిగాయి. మడిలైన్ కోవెను విజేతగా న్యాయనిర్ణేతలు ప్రకటించడంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. మడిలైన్ కు గతేడాది విజేత టెస్ అలెగ్జాండర్ స్వయంగా మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా-2016 కిరీటాన్ని అలంకరించింది. కిరీటం కైవసం చేసుకున్న ఆనందంలో మడిలైన్ చేతులు ఊపుతుండగా తల మీద నుంచి కిరీటం కొద్దిగా కిందకు జారింది.

దాంతో టెస్ అలెగ్జాండర్ మళ్లీ దాన్ని అందుకుని యథాస్థానంలో ఉంచారు. ఆ తర్వాత తనకు లభించిన క్రౌన్ తో కోవె స్టేజ్ నుంచి నవ్వుతూ కిందకు దిగి ఆహుతుల వద్దకు వెళ్లి తన సంతోషాన్ని పంచుకుంది.

1/7 Pages

English summary

Madeline Cowe was elected as a Miss world