అవకాశాలు లేక కాల్ గర్ల్ గా మారిన నచ్చావులే హీరోయిన్!

Madhavi Latha turned as a call girl

05:27 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Madhavi Latha turned as a call girl

నచ్చావులే, స్నేహితుడా, మిథునం, అరవింద్ 2 వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన మాధవి లత ఇప్పుడు అవకాశాలు లేక కాల్ గర్ల్ గా మారింది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఇదంతా నిజం జీవితంలో కాదు రీల్ జీవితంలో. ఆ వివరాల్లోకి వెళితే.. చాలా మంది హీరోయిన్లు అందానికి ప్రాధాన్యమున్న పాత్రల్లో కన్నా, నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించడానికే ఎక్కువ ఇష్ట పడతారు. అలా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో వేశ్య పాత్ర కూడా ఒకటి. ఇలాంటి వేశ్య పాత్రల్లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు, చిన్న హీరోయిన్లు సైతం నటించి మార్కులు కొట్టేశారు.

ఇప్పుడు తాజాగా కాల్ గర్ల్ పాత్రలో నటించింది. కెరీర్ ఆరంభంలో వరుసగా ఐదారు సినిమాలు చేసినా, అవి ఊహించినంతగా ఆడకపోవడంతో ఆమెకు అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమయ్యింది. అయితే ఇప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకుని 'ఆన్ మోనాస్ బర్త్ డే'(On Mona's Birthday) అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఇందులో కాల్ గర్ల్ పాత్రలో మాధవి లత నటించింది. ఈ షార్ట్ ఫిలింలో అంతగా ఏముందో తెలీదు కానీ కాల్ గర్ల్ పాత్రలో ఈ అమ్మడు నటించింది. ఈ షార్ట్ ఫిలిం ని కొంచెం ఎక్కువ బడ్జెట్ తో తీసారట. సునీల్ కశ్యప్ సంగీతం కూడా అందించాడు.

ఓ ఏడేళ్ల బాలుడికి-ఓ కాల్ గర్ల్ కి మధ్య జరిగే కథే ఈ షార్ట్ ఫిలిం సారాంశం. ఈ షార్ట్ ఫిలిం చూసైనా మాధవి లతకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

English summary

Madhavi Latha turned as a call girl