మధుప్రియ ని ఆ రిపోర్టర్‌ ఎంత సిగ్గులేని ప్రశ్న వేసిందంటే..!

Madhupriya hurts by Media

01:00 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Madhupriya hurts by Media

ఇటీవల మధుప్రియ న్యూస్‌ ఛానల్స్‌లో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె కష్టాల్లో ఆమె ఉంటే టిఆర్‌పీ కోసం మీడియా వాళ్ళు ఆరాటపడుతున్నారు. వాళ్ల టిఆర్‌పీ కోసం ఏడుస్తున్న వాళ్ళని ఇంకా ఏడిపిస్తారు. వాళ్ళ ప్రశ్నల వర్షంతో మరింత బాధలోకి సెడతారు కొంతమంది రిపోర్టర్లు. ఎందుకిలా అనాల్సి వస్తుందంటే ఒక లీడింగ్‌ పొజిషన్‌లో ఉన్న తెలుగుఛానల్‌ రిపొర్టర్‌ మధుప్రియని అత్యంత దారుణంగా ప్రశ్నించింది. 

మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

వివరాల్లోకి వెలితే చిన్న వయస్సులోనే పుస్తకాలు పట్టాల్సిన చిన్నారి తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటలతో రికార్డ్‌ సృష్టించింది. ఆడపిల్లలంటే అంత లోకువా అంటూ తన పాటలలో సమాజాన్ని కడిగి పాడేసింది. ఈ విధంగా చిన్న వయస్సులోనే ఎంతో దైర్యంగా నిలిచింది ఈ చిన్నారి. అలాంటి ఈమె గత ఏడాది అక్టోబరు లో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తరువాత రీసెంట్‌ గా ఆమె భర్త శ్రీకాంత్‌ తనని వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె బాధలో ఆమె ఉంటే కొంతమంది మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలు ఆమెను ఇంకా బాధకు గురిచేస్తున్నాయి. సెలబ్రెటీలు మీడియాతో  ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు కాని ఎంతో ఓపిగ్గా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది మధుప్రియ.

సర్జరీలతో సక్సెస్స్ అయిన హీరోయిన్లు

కాని కొంతమంది ఛానల్‌ వాళ్ళు టీఆర్‌పీ ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఆమెను ఉద్వేగానికి గురయ్యేలా చేసి వాళ్ళ ఛానల్స్‌ టీఆర్‌పీ ని పెంచాలని చూస్తున్నారు. అలాగే ఒక రిపోర్టర్‌ ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ 'నీ కష్టాలపై ఓ పాట పాడగలవా' అని అడిగింది. దీనికి మధుప్రియ 'నాకంత ఓపిక లేదక్కా' అంటూ సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. కష్టాల్లో ఉన్న వారి మీద మీడియా రిపోర్టర్లకు జాలి, దయ ఉండాలని, వారి కష్టాలను తమ టీఆర్‌పీ పెంచుకోవడానికి ఉపయోగిస్తే అంతకన్నా సిగ్గు చేటు లేదు అంటున్నారు ఈ న్యూస్‌ తెలుసున్న వారంతా.

భర్త గుట్టు విప్పిన మధుప్రియ

మధుప్రియ తండ్రి మల్లేశ్‌ అరెస్ట్‌

మా ఆయన మంచోడు : మధుప్రియ

1/7 Pages

సింగర్

మధుప్రియ చిన్నవయస్సులోనే సింగర్ గా మంచి గుర్తింపు పొందింది.1997 న మల్లేష్ సుజాత దంపతులకు జన్మించింది.

English summary

Madhupriya became famous with the song "Adapillanamma Nenu Adapilanani". She complained against her husband in Humayun Nagar Police station, after that she realized she says my husband is good. But some of media reporters asking foolish questions during interview so madhupriya hurts a lot.