పేరు మార్చుకుని అడల్ట్ సినిమా లో నటిస్తుంది

Madhurima Banerjee is acting in One Night Stand movie

03:20 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Madhurima Banerjee is acting in One Night Stand movie

తెలుగులో విలన్ పాత్రలు చేసే అజయ్‌ ను హీరోగా పరిచయం చేస్తూ 2009 లో తెరకెక్కిన 'ఆ ఒక్కడు' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ మధురిమ మొదటి చిత్రమే అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడు కి అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే మొదటి చిత్రంలోనే అందాలు విపరీతంగా ఆరబోసింది. ఆ తరువాత మధురిమ సరదాగా కాసేపు, ఆరెంజ్, వేట, గ్రీన్ సిగ్నల్, టెంపర్ వంటి చిత్రాల్లో నటించింది. 'కొత్త జంట' చిత్రంలో మధురిమ చేసిన 'అటు అమలాపురం ఇటు పెద్దాపురం' ఐటమ్ సాంగ్ అయితే కుర్రాళ్లలో వేడి పుట్టించింది. నాగ చైతన్య నటించిన 'దోచేయ్' చిత్రంలో కూడా ఐటమ్ సాంగ్ చేసింది.

ఆ తరువాత కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా చాలా చిత్రాల్లో నటించింది. కానీ ఎన్ని చేసిన ఈ హాట్ బ్యూటీ ని పట్టించుకునే వాళ్లే లేరు. దాంతో ఇప్పుడామె తన పేరు మార్చుకుని తన కెరీర్ టర్న్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది. అందుకే తన పేరుని నైరా బెనర్జీగా మార్చుకుంది. అలా పేరు మార్చుకున్నాక బాలీవుడ్‌లో 'వన్ నైట్ స్టాండ్' అనే ఓ అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రంలో నటిస్తుంది. ఇందులో సన్నీ లియోన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అంటే సహజంగానే ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్ అధిక మొతాదులో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో నైరా బెనర్జీ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తుంది.

ఈ సినిమాతో బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని మధురిమ పేరుని నైనా బెనర్జీగా మార్చుకుంది. మరి బాలీవుడ్ లో అయినా నైరా బెనర్జీ కి బ్రేక్ వస్తుందో లేదో చూడాలి.

English summary

Madhurima Banerjee is acting in One Night Stand movie. Madhurima Banerjee alias Nyra Banerjee is acting in adult movie One Night Stand.