జయ ఆరోగ్యంపై కోర్టు ఆదేశం!

Madras court gave directions to Tamilnadu government

12:35 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Madras court gave directions to Tamilnadu government

జయలలిత ఆరోగ్యంపై బుధవారంలోగా వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అమ్మ ఆరోగ్య వివరాలు కోరుతూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. జయ హెల్త్ పై నివేదికను రాత పూర్వకంగా/కోర్టుకు సమర్పించాలని, లేదా మౌఖికంగా వివరించాలని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని కోర్టు అభిప్రాయపడింది.

1/4 Pages

మరింత మెరుగు పడిందన్న వైద్యులు...


అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సిఎం జయలలిత ఆరోగ్యం మరింత మెరుగు పడిందని, ఇన్ ఫెక్షన్ తగ్గేందుకు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారని, చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే ఇన్ ఫెక్షన్ పూర్తిగా తగ్గేందుకు ఆమె మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండవలసిన అవసరం ఉందన్నారు. అమ్మ కోలుకుంటున్నారని, కాస్త కళ్ళు తెరచి చూశారని, ఆ సమయంలో డాక్టర్లు కొద్దిసేపు వెంటిలేటర్ తొలగించారని తెలిసింది. జయలలిత కోలుకుంటున్నట్టు ఆమె స్నేహితురాలు, ది హిందూ మాజీ ఎడిటర్ మాలిని పార్థసారథి ట్వీట్ చేశారు. అమ్మ మళ్ళీ ఆరోగ్యంతో తిరిగి వస్తారని కొండంత ఆశతో ఉన్న ఏఐడీఎంకె వర్గాలను ఈ వార్తలు సంతోషంలో ముంచెత్తాయి.

English summary

Madras court gave directions to Tamilnadu government