అడుక్కునైనా సరే .. మనోవర్తి ఇవ్వాల్సిందేనన్న కోర్టు

Madras high Court Announced Husband Should Pay Money to Wife after Divorce

10:53 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Madras high Court Announced Husband Should Pay Money to Wife after Divorce

'పెళ్లి చేసుకుని, ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడిపేద్దాం' అంటూ గతంలోనే ఓ సినీ కవి రాసిన పాట చాలామందికి గుర్తే కదా. పెళ్లి ముచ్చట అంత గొప్పది. ఒకవేళ వికటిస్తే, నరకమే అవుతుంది. పైగా ఏదైనా తేడా వస్తే విడాకులు ఇవ్వటం ఈ మధ్యన కామన్ అయిపోయింది. విడాకుల సెటిల్ మెంట్లో భాగంగా భార్యకు మనోవర్తి ఇవ్వాల్సిన పరిస్థితి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా మిగిలిన సందర్భాల్లో విడాకులు ఇచ్చిన భర్త.. తన మాజీ భార్యకు మనోవర్తి చెల్లించాల్సిందే. ఇలా చెల్లించాల్సిన మనోవర్తిని తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని.. ఎగగొట్టటానికి అవకాశమే లేదని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. అవసరమైతే అడుక్కునైనా సరే, భార్యకు మనోవర్తిని చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తెగేసి చెప్పేసింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన సెల్వరాజన్.. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టికి చెందిన శ్రీరంగ సుభద్రలు పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల కాపురం తర్వాత వారి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అవి ముదిరి పాకాన పడడంతో విడాకులు తీసుకున్నారు. తన జీవనభృతి కోసం సుభ్రద కోర్టు కెక్కింది. దీంతో కోర్టు కేసును విచారించి, ప్రతి నెల రూ.10వేలు చొప్పున ఇవ్వాలని, నష్టపరిహారంగా రూ.50వేలు ఇవ్వాలని సెల్వరాజన్ ను ఆదేశించింది. దీంతో అతడు స్పందిస్తూ, తనకు ఉద్యోగం లేదని, తాను మనోవర్తిని ఇవ్వలేనని సెల్వరాజన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు . కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన కోర్టు.. మనోవర్తిని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవ్వాల్సిందేనని.. అవసరమైతే.. అడుక్కొని అయినా మాజీ భార్యకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. దీన్ని బట్టి తొందరపడి విడాకులు ఇచ్చేస్తే, ఇక జీవితాంతం చెల్లింపు చేయాల్సిందే. అందుకే కాస్తంత జాగ్రత్త వహిస్తే, సక్రమంగా ఆలోచిస్తే, విడాకులు ఇవ్వడం చాలామటుకు తగ్గుతుందని చెప్పవచ్చు.

ఇది కూడా చూడండి : ఈ 3 వస్తువుల్లో మీరు ఏ టైపు.?

ఇది కూడా చూడండి : ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి : చైతూ-సమంతల పెళ్లి డేట్ ఫిక్స్

English summary

Madras high Court Announced Husband Should Pay Money to Wife after Divorce.