అక్రమ డౌన్ లోడ్ తగదంటూ కబాలికి హైకోర్టు దన్ను

Madras High Court Bars Internet Service Providers To Stop Kabali Piracy

10:52 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Madras High Court Bars Internet Service Providers To Stop Kabali Piracy

ఇదేమిటి అనుకుంటున్నారా, నిజం రజనికాంత్ మూవీ కబాలి ప్రొడ్యూసర్ ఎస్.థాను దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన మద్రాస్ హైకోర్టు సూపర్ స్టార్ కి దన్నుగా నిలిచింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లపై ఈ చిత్రాన్ని అక్రమంగా డౌన్ లోడ్ చేయరాదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.దేశంలో రిజిస్టర్ అయిన 169 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నాయి. ఈ నెల 22న రిలీజ్ కానున్న ఈ మూవీని అక్రమంగా డౌన్ లోడ్ చేయకుండా న్యాయస్థానం ఆంక్షలు విధించింది.

కాగా తన క్లయింటు తీసిన సినిమాలు పైరసీ బారిన పడి కేవలం 10 రూపాయలకే డౌన్ లోడ్ చేసుకున్న వైనం ఆందోళన కలిగిస్తోందని థాను తరఫు న్యాయవాది విజయ్ నారాయణ్ పేర్కొన్నారు. సినిమాల పైరసీ బెడదను అరికట్టేందుకు ఇలా ఆంక్షలు విధించినట్టు న్యాయమూర్తి ఎస్.కృపాకరన్ వ్యాఖ్యానించారు. కబాలి సినిమాను చట్టవిరుద్ధంగా కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేయకుండా ఎమ్మెస్వోలను కూడా కట్టడి చేస్తున్నామని పేర్కొన్నారు. తేరి , కనిదన్ వంటి తన సినిమాల పైరసీ కారణంగా తాను ఎంతో నష్టపోయానని పిటిషనర్ తెలిపారు. కబాలి ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని, ఆన్ లైన్ పైరసీ ఎవరు చేసినా సహించేది లేదని న్యాయమూర్తి హెచ్చరించారు.మంచి కుటుంబ విలువలున్న సినిమాలెన్నో గతంలో పైరసీకి గురయ్యాయని, ఆ ప్రభావం ఈ మూవీపై కూడా పడవచ్చునని అన్నారు. దీనిపై నటీనటులు కూడా దృష్టి పెట్టాల్సిన సామాజిక బాధ్యత వారిపై ఉందన్నారు.

ఇవి కూడా చదవండి:మెగాస్టార్ 150వ మూవీ జిరాక్స్ కాపీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్నికృష్ణ

ఇవి కూడా చదవండి:డైరెక్టర్ తో నదియా రొమాన్స్!

English summary

Super Star Rajinikanth's upcoming flick Kabali was going to release on this month 22nd and this movie was releasing in a grand way around the world and Madras High Court Bars Internet Service Providers From Allowing Kabali Downloads.