ప్రియుడి ముందే ఆమెపై గ్యాంగ్ రేప్

Madras High Court gave lifetime punishment to gang rapists

06:45 PM ON 30th January, 2017 By Mirchi Vilas

Madras High Court gave lifetime punishment to gang rapists

నేరాలు, ఘోరాలు , రేప్ లు మర్దర్లు లెక్కలేకుండా సాగిపోతున్నాయి. అంతేకాదు వికృత చర్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ యువతిపై ప్రియుడి ముందే గ్యాంగ్ రేప్ చేసి, ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించారట. ఈ సంగతి బయటపెడితే ఈ వీడియో ఇంటర్నెట్ లో పెడతామని నలుగురు నిందితులు బెదిరించారు. ఈ నిందితులకు మద్రాసు హైకోర్టు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. అర్ధరాత్రి ఒంటరిగా స్త్రీ రోడ్డుపై నిర్భయంగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని గాందీ చెప్పిన మాటలను కోర్టు ప్రస్తావించింది. ఈకేసు వివరాల్లోకి వెళ్తే,

2014 లో కృష్ణగిరి జిల్లా సమీపంలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి కారులో వెళ్తోంది. అయితే మార్గమద్యలో మూత్రవిసర్జన కోసం ఆమె రోడ్డు పక్కకు వెళ్ళింది.అప్పుడే ఆ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. యువతి కేకలు విన్న ప్రియుడు కారు వద్ద నుండి యువతి వద్దకు వచ్చాడు. కానీ ఆ యువకుడిని కూడా వాళ్ళు తీవ్రంగా కొట్టారు. అంతేకాదు కట్టేసి, అతని కళ్లెదుటే, ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా ఈ దృశ్యాలను వీడియో తీశారు.

ఈ విషయాన్ని బయటకు చెబితే ఇంటర్నెట్ లో ఈ వీడియో పెడతామని బెదిరించారు. అయినా సరే, నిందితుల బెదిరింపులను పట్టించుకోకపోగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు పొడపట్టి గ్రామానికి చెందినవారని గుర్తించారు. రాయకొట్టై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకొన్నారు. కృష్ణగిరి పాష్ట్ ట్రాక్ మహిళా కోర్ట్ సెషన్స్ జడ్జి 2015 లో నిందితులకు జీవిత ఖైదు విధించారు.

అయితే ఈ తీర్పుపై నిందితులు మద్రాస్ హైకోర్టు అప్పీలు చేసుకొన్నారు. అయితే మద్రాస్ హైకోర్టు నిందితులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. దిగువస్థాయి కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది. దిగువ కోర్టు బాధితులకు చట్ట ప్రకారంగా చెల్లించాల్సిన పరిహరాన్ని చెల్లించకపోవడం విచారకరమని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం బాధితురాలికి 8 లక్షల రూపాయాలను ఇవ్వాలని తీర్పు ప్రకటించింది.

ఇది కూడా చూడండి: 840 ఏళ్ల క్రితం ఇక్కడే పుట్టానని., అప్పటి స్మృతులు ప్రస్తావిస్తున్న భూటాన్ యువరాజు.!

ఇది కూడా చూడండి: కుండీలో చెత్త వేయండి - ఫ్రీ వైఫై ఇంటర్నెట్ పొందండి

English summary

Madras High Court gave sensational judgement of lifetime punishment to krishna giri gang rappists.