తెలుగుకు ప్రాచీన హోదాపై మద్రాస్ హైకోర్టు తీర్పు

Madras High court judgement for special status for telugu

06:42 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Madras High court judgement for special status for telugu

నిబంధనల ప్రకారమే తెలుగుకి ప్రాచీన హోదా కల్పించినట్లు మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రాచీన హోదా పొందేందుకు తెలుగుకు అన్ని అర్హతలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ ను మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని స్పష్టం చేసింది. తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాది రవీంద్రనాథ్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక సంఘం సంచాలకుడు మామిడి హరికృష్ణ ధర్మాసనానికి వివరాలు సమర్పించారు.

తెలుగుకి ప్రాచీన హోదా ఇవ్వనందుకు నిరసనగా దివంగత సినీ రచయిత వేటూరి సుందర రామమూర్తి తనకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరస్కరించిన సంగతి తెల్సిందే. పెద్దఎత్తున పోరాటం జరిగాక తెలుగుకి ప్రాచీన హోదా డిక్లర్ చేసారు. దీనిపై కోర్టుకు వెళ్లగా, ఇప్పుడు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary

Madras High court judgement for special status for telugu