రూ. 2వేల నోటు యవ్వారంపై... కేంద్రానికి మదురై కోర్టు నోటీసు

Madurai court notice to cabinet

01:28 PM ON 3rd December, 2016 By Mirchi Vilas

Madurai court notice to cabinet

పాత ఐదొందలు, వెయ్యిరూపాయల నోట్లను రద్దు చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూ. 2వేల నోట్లను చెలామణీ చేసింది. అయితే, పెద్ద నోట్ల రద్దుతో రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన రూ. 2 వేల నోటు చెల్లదని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై మదురై హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆ నోటుపై దేవనాగరి భాషలో అంకెలుండటం వల్ల అది చెల్లదని ప్రకటించాలంటూ అగ్రి గణేశన్ అనే ప్రముఖుడు మధురై హైకోర్టు డివిజన్ బెంచ్ లో ప్రజాహిత వాజ్యం వేశారు.

పిటిషనర్ ఏమన్నారంటే, 1963 నాటి అధికార భాషా చట్టం ప్రకారం దేవనాగరి అంకెలను ఉపయోగించాలని ఎక్కడా పేర్కొనలేదని, ఇప్పటి దాకా ప్రభుత్వం ముద్రించిన కరెన్సీ నోట్లలో ఆ అంకెలు లేవని, నోట్లపై దేవనాగరి అంకెలను ముద్రించాలంటే పార్లమెంట్ అనుమతి తప్పనిసరని, కొత్త రూ 2 వేల నోట్లపై దేవనాగరి అంకెలను ముద్రించడం రాజ్యాంగ శాసనం 343 ప్రకారం చెల్లదని పేర్కొన్నారు.

1/3 Pages

ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి నాగముత్తులతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ఈ కేసును సుప్రీం కోర్టుకు బదలీ చేయాలన్న డిమాండ్ ను ధర్మాసనం తోసిపుచ్చింది.

English summary

Madurai court notice to cabinet